Visakhapatnam: ఏదో చేయబోయి ఎదో అయ్యింది అంటే ఇదే. పూజల కోసం ఆ జ్యోతిస్యుడిని పిలిపిస్తే వాడు పూజలు ఏమో కానీ ..పాపను చూసి ..బాగానే గెలికాడు. ఇదేందీ ఇది..పూజలు చేయు అంటే…పాడుపనులు చేస్తున్నాడు అని ..మ్యాటర్ మొగుడికి చెప్పింది . మరొకసారి రా..పూజలు చేద్దాం అని పిలిపించి…కత్తితో కోసి చంపేశాడు ఆ మొగుడు. ఇంతకీ ఇక్కడ ఒక విషయం మాతరం అవడం ఎల్దు. పూజ ఐతే జరిగింది కదా …ఆ పూజ జరగడం వల్ల పూజ చేసిన వాడు చనిపోయాడా ? లేక పూజ చేయించుకున్న వాళ్ళు జైలు వెళ్ళడానికి పూజ జరిగిందా ? ఏంటో లే
విశాఖలో దారుణం చోటుచేసుకుంది. తన భార్య పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని ఓ గురూజీని అతి కిరాతంగా చంపాడు భర్త చిన్నారావు. తన పట్ల ఎవరూ లేని సమయంలో అసభ్యంగా ప్రవర్తించాడని భార్య మౌనిక చెప్పడంతో.. చిన్నారావు అతి కిరాతకంగా ఆ పూజారిని కొట్టి చంపిన ఘటన భీమిలిలో చోటుచేసుకుంది. అయితే ఈనెల 7న పూజల కోసం జ్యోతిష్యుడు అప్పన్నను ఇంటికి పిలిపించింది భార్య మౌనిక. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోడంతో జ్యోతిష్యుడు అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని భర్త చిన్నారావుకు మౌనిక చెప్పింది. తన తల్లికి ఆరోగ్యం బాగోలేదు.. పూజలు చేయడానికి రావాలని చిన్నారావు ఆ జ్యోతిష్యుడని పిలిచి అతి కిరాతంగా హత్య చేసినట్లు తెలుస్తోంది.
Also Read: Crime News: మోసం చేయను చెప్పినందుకు విద్యార్థులపై కాల్పులు . . ఒకరి మృతి
ఈ నేపథ్యంలో విశాఖ ఆనందపురం హత్యకేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. లైంగిక వేధింపులే హత్యకు కారణంగా తేల్చారు. ఈ కేసులో భార్యాభర్తలను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. జ్యోతిష్య వృత్తిలో ఉన్న అప్పన్నను భార్యాభర్తలు చంపారు. చిన్నారావు భార్య మౌనికతో అప్పన్న అసభ్యంగా ప్రవర్తించాడు. విషయం తెలుసుకున్న చిన్నారావు అప్పన్నను చాకుతో పొడిచి హత్య చేశాడు. ఆ తర్వాత 2 లీటర్ల డీజిల్, 2 లీడర్ల పెట్రోల్ తెచ్చి మృతదేహాన్ని భార్యాభర్తలు కలిసి కాల్చేశారు.
ఈ నెల 9వ తేదీ నుంచి మోతి అప్పన్న మిస్ అయ్యాడు. ఆనందపురం పీఎస్లో కేసు నమోదు అయింది. అస్థిపంజరం వద్ద పూసలు ఉండటంతో అది తన తండ్రిదే అని కుమారుడు దుర్గాప్రసాద్ గుర్తించాడు. ఘటనా స్థలంలో ఉన్న పూసలు, రక్త నమూనాలను సేకరించారు పోలీసులు.

