Kuppam

Kuppam: చిత్తూరు జిల్లా కుప్పంలో దారుణ ఘటన

Kuppam: చంపడానికే పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టించాడా.. లేక పంచాయతీ పెట్టినాకనే చంపాలనే ఆలోచన వచ్చిందా.. కూతురు తనకు ఇష్టం లేని పెళ్లి చేసుకుంది అనే కోపంతోనే అల్లుడ్ని చంపాలనకున్నడు.. కత్తితో పొడిచి పొడిచి చంపాలనుకున్నాడు.. అల్లుడు అనే కనికరం కూడా లేదా.. కూతురి సంతోషం కన్నా పరువు ప్రతిష్టలే ముఖ్యమా.
ప్రస్తుతం సమాజంలో ప్రేమ వివాహాలు ఎక్కువ సంఖ్యలో జరుగుతున్నా.. కొన్ని చోట్ల మాత్రం ప్రేమ పెళ్లిళ్లు విషాదంగా మారుతున్నాయి. ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లల ప్రేమను అంగీకరించకపోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయి. పెద్దలు ఒప్పుకోలేదని ప్రేమికులు ఆత్మహత్యలు చేసుకోవడమో లేక తమకు ఇష్టలేని పెళ్లి చేసుకున్నారని, వేరే కులం యువకుడిని వివాహం చేసుకున్నారని ఆగ్రహించే పెద్దలు వారిపై దాడికి తెగబడటం లాంటి ఘటనలు తరచూ చోటు చేసుకుంటూఉన్నాయి. తాజాగా చిత్తూరు జిల్లా కుప్పంలోనూ అలాంటి దారుణమే చోటు చేసుకుంది. కూతురు తమకు ఇష్టంలేని పెళ్లి చేసుకుందని, ఓ తండ్రి కూతురితో పాటు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్న అబ్బాయిపై కూడా కత్తితో దాడి చేశాడు.

గుడుపల్లి మండలం అగరం కొత్తూరు కు చెందిన కౌసల్య, చంద్రశేఖర్ వారం రోజుల క్రితం పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే వారి పెళ్లి అయిపోయిన తర్వాత భవిష్యత్తులో గొడవలేం లేకుండా.. తమ వాళ్లతో మాట్లాడాల్సిందిగా ప్రేమ జంట గ్రామ పెద్దలను ఆశ్రయించారు. వారి ప్రేమపెళ్లి వ్యవహారం పై పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించారు. ఈ మేరకు కౌసల్య చంద్రశేఖర్ తో పాటు కౌసల్య తండ్రి శివప్పను కూడా పంచాయితీకి పిలిపించారు. కుప్పంలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో రాజీ చేసేందుకు ప్రయత్నించారు.

కానీ, కూతురి ప్రేమ వివాహం చేసుకోవడం ఇష్టంలేని శివప్ప.. పెద్దల సమక్షం లోనే కత్తితో కౌసల్య, చంద్రశేఖర్ లపై ఒక్కసారిగా దాడికి దిగాడు. ఈ ఊహించని ఘటనతో అంతా షాక్‌ అయ్యారు. అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం చేసుకోనేలోపే.. శివప్ప ప్రేమ జంటపై కత్తి పోట్ల వర్షం కురిపించాడు. శివప్పను ఆపే ప్రయత్నంలో మరో ఇద్దరు కూడా కత్తి గాయాలకు గురయ్యారు. అయితే ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన కౌసల్య, చంద్రశేఖర్ లను చికిత్స కోసం దగ్గర్లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  NDA: కూటమి బిగ్ ప్లాన్..సౌత్ కు పవన్..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *