Gujarat: జీరా సోడా + మందు = ముగ్గురి ప్రాణాలు. ఆ రెండు కలిపి తాగితే …నెక్స్ట్ మీ ప్రాణాలు కూడా ఇంతే. ఏంటి మందు బాబులు అర్తం అవుతుందా ? తాగడం మీ ఇష్టం. కాని..తాగే మందులో కల్పరానిది కలిపి తాగితే..అదే మీ లాస్ట్ పెగ అవుతుంది. సో..తాగండి ..తాగండి..తందనాలు ఆడండి. కాని…ఎదవ కాoబినేషన్స్ మాత్రం వద్దనే వద్దు ..అర్తం అయిందా మందు బాబులు.
ప్రాణాలు తీసిన జీరా సోడా.. వేడికి తట్టుకోలేక ఆ ముగ్గురు తాగిన జీరా సోడా ప్రాణాలు తీస్తుంది అని కలలో కూడా ఊహించి ఉండరు.. గుజరాత్ లో కలకలం..జీరా సోడాలో మద్యం కలిపి సేవించడం వల్లనే ప్రాణాలు కోల్పోయారని వల్ల స్నేహితుల వద్ద సమాచారం.. రక్త పరీక్షలు చేస్తే ఒకరిలో 0.1 ఇథనాల్ ఆల్కహాల్ మరొకరిలో 0.2 ఇథనాల్ ఆల్కహాల్ ఉన్నట్లుగా గుర్తించారు..
గుజరాత్‌లో దారుణం జరిగింది. ఎండలు మండిపోతుండటంతో సేద తీరేందుకు చల్లటి సోడా తాగిన ముగ్గురు వ్యక్తులు మరణించిన ఘటన సంచలనం రేపుతోంది. గుజరాత్ ఖేడా జిల్లా నదియాద్ నగరంలో ముగ్గురు వ్యక్తులు యోగేష్ కుష్వాహా, రవీంద్ర రాథోడ్, కనుభాయ్ చౌహాన్ అనుమానాస్పదంగా చనిపోయారు. అయితే వీరు ముగ్గురు జీలకర్ర సోడాతో సహా మద్యం సేవించినట్లు వారి స్నేహితులు తెలిపారు. ఈ కారణంగానే ఆరోగ్య పరిస్థితి విషమించడతో స్నేహితులు నాడియాద్ సివిల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే ఆసుపత్రికి అడ్మిట్ అయిన కాపేపటికే చనిపోయారని పోలీసు అధికారి రాజేశ్ గాధియా తెలిపారు.
Also Read: Rashmika Mandanna: పాన్ ఇండియా హ్యాట్రిక్ హిట్ పై కన్నేసిన రష్మిక మందన్న!
ఈ ఘటనపై కేసు నమోదు చేసి జీరా సోడా బాటిల్‌ను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ పరీక్షకు పంపించినట్లు తెలిపారు. ఆ బాటిళ్లలో ఏముందో తమకు ఖచ్చితంగా తెలియదన్నారు. విచారణలో మాత్రం మృతుల్లో ఇద్దరి రక్తంలో 0.1 ఇథనాల్ ఆల్కహాల్, మరొకరిలో 0.2 ఇథనాల్ ఆల్కహాల్ ఉన్నట్లు రక్త నమూనా పరీక్షల్లో తేలిందన్నారు.
పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిన తర్వాత ఘటనపై మరింత స్పష్టత రానుందని చెప్పారు. 2022లో అహ్మదాబాద్, బోటాడ్ జిల్లాలో కల్తీ మద్యం సేవించి 42 మంది కన్నుమూశారు. 2023 డిసెంబర్ లోనూ గుజరాత్ లో ఇలాగే మిథైల్ ఆల్కహాల్ కలిగిన ఆయుర్వేద సిరప్ తాగి 5గురు చనిపోయారు.