AP News

AP News: అల్లూరి జిల్లా చింతపల్లిలో దారుణ ఘటన

AP News: భార్యభర్తల మధ్య గొడవల్లోకి ఏ ఒక్కరూ ఎంటర్ కారు.. ఒకవేళ జోక్యం చేసుకున్నా ఇబ్బందులు తప్పవు.. ఆ తరహా సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇద్దరు బావమరుదులు ఎంటరయ్యారు. పట్టరాని కోపంతో వారిని శూలంతో పొడిచి చంపేశాడు స్వయానా బావ.. అప్పటిగానీ ఆ వ్యక్తి కోపం చల్లారలేదు.. ఈ ఘటన ఉమ్మడి విశాఖ జిల్లా ఏజెన్సీలో చోటుచేసుకుంది.

అల్లూరి జిల్లా చింతపల్లిలో భార్యభర్తల మధ్య గొడవ ఇద్దర్ని బలి తీసుకుంది.ఈ ఘటన జిల్లాలోని గూడెం కొత్త వీధి మండంలో చోటుచేసుకుంది.గూడెం కొత్త వీధిలో మూరుమూల గ్రామంలో భార్యభర్తలు ఉంటున్నారు. అయితే, ఆ ఇల్లాలి భర్త చీటికి మాటికీ డబ్బులు తీసుకుని తాగుడికి బానిసయ్యాడు. ఈ క్రమంలో భార్యభర్తల మధ్య తరుచు గొడవలు జరిగేవి.

ఈ విషయం ఆ మహిళ సోదరులకు తెలిసింది. వెంటనే కృష్ణ, రాజు కలిసి తన సోదరి ఇంటికి వచ్చారు. ఈ క్రమంలో బావ గెన్నును అడ్డుకునే ప్రయత్నం చేశారు. పట్టరాని కోపంతో అందుబాటులో ఉన్న శూలంతో పొడిచాడు. దీంతో అక్కడికక్కడే అతడు మృతి చెందాడు..మద్యమైకంలో ఉండడంతో మరో బావమరిదిని ఆదే శూలంలో పొడిచి చంపేశాడు.. ఈఘర్షణను అడ్డుకోబోయిన మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు.

మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సీలేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వ్యక్తిని విశాఖ కేజీహెచ్‌లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నాడు. ప్రస్తుతం బాధితుడి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు. ఘటనపై భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తును చేపట్టారు.

నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ విషయంలో నిందితుడు భార్య నిజం చెబితేనే అసలు విషయాలు బయటకు వస్తాయని అంటున్నారు. స్థానికుల వెర్షన్‌ మరోలా ఉంది. వీరిద్దరు గొడవ పడడం రోజూ సహజమేనని అంటున్నారు. మధ్యలోకి అనవసరంగా వచ్చారని అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *