Ramam Raghavam

Ramam Raghavam: కాస్తంత ఆలస్యంగా ‘రామం రాఘవం’

Ramam Raghavam: హాస్యనటుడిగా చక్కని గుర్తింపు తెచ్చుకున్న ధనరాజ్ కొన్ని సినిమాలలో కీలక పాత్రలు పోషించాడు. అంతేకాదు…. తాను హీరోగా నటించిన ‘రామం రాఘవం’ పేరుతో ఓ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో రూపొందించాడు. పృథ్వీ పోలవరపు నిర్మించిన ఈ సినిమాను ఫిబ్రవరి 14న విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ తొలుత ప్రకటించారు. అయితే ఇప్పుడీ సినిమా ఫిబ్రవరి 28న రిలీజ్ కాబోతోందని తెలిపారు. సముతిర కని, హరీశ్ ఉత్తమన్, సత్య, వెన్నెల కిశోర్, శ్రీనివాస రెడ్డి, ప్రమోదిని తదితరులు ఈ సినిమాలు ఇతర కీలక పాత్రలు పోషించారు. అరుణ్‌ చిలువూరి ఈ సినిమాకు సంగీతాన్ని సమకూర్చారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *