Dr Rajasekhar: టాలీవుడ్లో యాంగ్రీ స్టార్ అనే ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు డా. రాజశేఖర్. డాక్టర్‌గా కెరీర్‌ను ప్రారంభించి, ఆ తర్వాత హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనదైన శైలి నటనతో, ఆవేశభరిత పాత్రలతో మాస్ ప్రేక్షకులకు ఎన్నో గుర్తుండిపోయే సినిమాలు అందించారు. వయసుతో సంబంధం లేకుండా ఇప్పటికీ వరుస సినిమాలు చేస్తూ బిజీగా కొనసాగుతున్న ఆయన తాజాగా తన కొత్త సినిమా షూటింగ్లో గాయపడ్డారు. హీరోగా అయినా, కీలక పాత్రల్లో అయినా తనదైన పాత్రకు న్యాయం చేసే నటుడిగా రాజశేఖర్‌కు సినీ వర్గాల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది.
రాజశేఖర్ తన కొత్త సినిమా షూటింగ్లో ఉండగా ఈ ప్రమాదం జరిగింది. నవంబర్ 25న మేడ్చల్ సమీపంలో జరుగుతున్న చిత్రీకరణలో ఒక యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తుండగా ఆయన కుడికాలికి తీవ్ర గాయం అయ్యింది. గాయం తీవ్రత దృష్ట్యా, చిత్ర యూనిట్ సిబ్బంది వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు.
ఇది కూడా చదవండి: GHMC: GHMC వార్డుల సంఖ్య భారీగా పెంపు.. ఉత్తర్వులు జారీ..
అక్కడ వైద్యులు వెంటనే స్పందించి అత్యవసరంగా శస్త్రచికిత్స (Surgery) నిర్వహించారు. సుమారు మూడు గంటల పాటు జరిగిన ఈ సర్జరీలో వైద్యులు రాజశేఖర్ కాలిలో ప్లేట్లు, వైర్లు అమర్చారు.
ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని యూనిట్ వర్గాలు మీడియాకు తెలిపాయి. గాయం తీవ్రత దృష్ట్యా, డాక్టర్లు ఆయనకు కనీసం మూడు నుంచి నాలుగు వారాల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. వైద్యుల సలహా మేరకు రాజశేఖర్ ప్రస్తుతం ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. వరుస సినిమాలతో బిజీగా ఉన్న యాంగ్రీ స్టార్, గాయం కారణంగా తాత్కాలికంగా షూటింగ్‌కు దూరమయ్యారు. వైద్యులు సూచించిన విశ్రాంతి అనంతరం, ఆయన జనవరి 2026లో తిరిగి షూటింగ్లలో పాల్గొనే అవకాశం ఉంది. యాంగ్రీ స్టార్ రాజశేఖర్ త్వరగా కోలుకుని తిరిగి షూటింగ్లలో పాల్గొనాలని అభిమానులు, సినీ ప్రముఖులు ఆకాంక్షిస్తున్నారు.
