Delhi: t20 లైవ్ నుంచి తప్పుకున్న జియోహాట్ స్టార్

Delhi: భారత్, శ్రీలంక వేదికగా 2026 ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు ముందే జియోహాట్‌స్టార్ తీసుకున్న నిర్ణయం ఐసీసీకి పెద్ద షాక్‌గా మారింది. ఈ మెగా టోర్నీకి అధికారిక ప్రసారకర్తగా ఉన్న జియోహాట్‌స్టార్, భారీ ఆర్థిక నష్టాల కారణంగా మీడియా హక్కుల ఒప్పందం నుంచి వైదొలగుతున్నట్లు ఐసీసీకి అధికారికంగా తెలియజేసింది. దీంతో, భారత్‌లో అత్యధికంగా వీక్షించే టోర్నమెంట్‌ ప్రసార హక్కుల విషయంలో గందరగోళం నెలకొంది.

 

జియోహాట్‌స్టార్ కేవలం 2026 టీ20 ప్రపంచకప్ ప్రసార బాధ్యతల నుంచే కాదు, 2024–27 మధ్య కాలానికి కుదిరిన 3 బిలియన్ డాలర్ల మీడియా రైట్స్ ఒప్పందంలోని మిగిలిన రెండేళ్ల కాంట్రాక్ట్‌ను కూడా కొనసాగించలేమని తెలిపింది. పెట్టుబడులు భారీగా పెరగడం, సబ్‌స్క్రిప్షన్ వృద్ధి పడిపోవడం, అడ్వర్టైజింగ్ ఆదాయం తగ్గిపోవడం వంటి కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

 

ఈ పరిణామంతో అప్రమత్తమైన ఐసీసీ, ప్రత్యామ్నాయ మార్గాల కోసం వెంటనే చర్యలు ప్రారంభించింది. 2026–29 మధ్య కాలానికి గాను 2.4 బిలియన్ డాలర్లతో కొత్త మీడియా రైట్స్ విక్రయ ప్రక్రియను మొదలుపెట్టింది. ఈ క్రమంలో సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్ ఇండియా, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో వంటి ప్రముఖ ఓటీటీ సంస్థలను ఐసీసీ సంప్రదించినట్లు సమాచారం. అయితే, ఒప్పందం విలువ చాలా ఎక్కువగా ఉండటంతో ఇప్పటి వరకు ఏ సంస్థ కూడా ముందుకు వచ్చింది అన్న నిర్ధారణ లేదు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *