DK Shivakumar: కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఫ్యూచర్‌సిటీలో నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్‌లో పాల్గొన్నారు. సమిట్‌లో మాట్లాడుతూ.. అభివృద్ధి, పెట్టుబడుల విషయంలో హైదరాబాద్ నగరం బెంగళూరుతో తీవ్రంగా పోటీపడుతోందని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పష్టం చేశారు. అంతేకాకుండా, ఈ రెండు మహానగరాలూ కేవలం దేశీయంగానే కాకుండా, ప్రపంచంతో పోటీపడుతున్నాయని ఆయన అన్నారు.
Also Read: Indigo: ఇండిగో ప్రయాణికులకు శుభవార్త.. రూ.827 కోట్ల రీఫండ్, సగం బ్యాగులు వాపస్!
తెలంగాణ ప్రభుత్వం తరువాత తరానికి ఏం కావాలో ముందుగానే ఆలోచించి, అందుకు తగిన విధంగా పాలన సాగిస్తోందని ఆయన కొనియాడారు. తెలంగాణతో పాటు, మొత్తం సౌత్ ఇండియా అభివృద్ధికి తమ రాష్ట్రమైన కర్ణాటక పూర్తి సహకారాన్ని అందిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ఐటీ రంగంలో బెంగళూరు పాత్ర చాలా పెద్దదని, దేశ ఐటీ ఎగుమతుల్లో 40 శాతం వాటాను బెంగళూరు కలిగి ఉందని ఆయన తెలిపారు. అయినప్పటికీ, చిన్న రాష్ట్రంగా ఉన్నప్పటికీ, తెలంగాణ కూడా గొప్ప వాటాను కలిగి ఉండడం అభినందనీయమన్నారు. అంతర్జాతీయంగా భారతీయ ఇంజనీర్ల సామర్థ్యాన్ని వివరిస్తూ, అమెరికాలోని కాలిఫోర్నియా వంటి టెక్నాలజీ నగరాల్లో సుమారు 13 లక్షల మంది భారత ఇంజినీర్లు పనిచేస్తున్నారని శివకుమార్ చెప్పారు.

