Telangana Global Summit

Telangana Global Summit: తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు సర్వం సిద్ధం

Telangana Global Summit: తెలంగాణ ఆర్థిక వ్యవస్థను 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల స్థాయికి పెంచే లక్ష్యంతో నిర్వహించనున్న “తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్” కోసం భారత్ ఫ్యూచర్ సిటీలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సమ్మిట్ ఈ నెల 8, 9 తేదీల్లో జరగనుంది. మొత్తం ఆరు ఖండాల నుండి, 44 దేశాల నుండి 154 మంది ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరు కానున్నారు.

సమ్మిట్ ముఖ్యాంశాలు
రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ 8వ తేదీ మధ్యాహ్నం 1:30 గంటలకు ఈ సమ్మిట్‌ను ప్రారంభిస్తారు. 9వ తేదీ సాయంత్రం 6 గంటలకు ముగుస్తుంది. ఈ రెండు రోజుల్లో వివిధ రంగాలపై దృష్టి సారించి సదస్సులు నిర్వహించనున్నారు.

Telangana Global Summit

ముఖ్యమైన అంశాలు:

పవరింగ్ తెలంగాణ-2047: ఇంధన రంగ పరివర్తన (ఎనర్జీ ట్రాన్సిషన్).

గ్రీన్ మొబిలిటీ-2047: జీరో ఎమిషన్ వాహనాలు.

టెక్ తెలంగాణ-2047: సెమీ కండక్టర్స్ మరియు సరిహద్దు టెక్నాలజీలు.

తెలంగాణ రైజింగ్: అందరికీ అందుబాటులో, సమానమైన ఆరోగ్య సంరక్షణ.

తెలంగాణ ఫ్లయింగ్ హై: ఏరో స్పేస్, డిఫెన్స్ రంగాల పెరుగుదల.

జీనోమ్ వ్యాలీ అండ్ బియాండ్: లైఫ్ సైన్సెస్‌లో నవకల్పనల వేగవంతం.

మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం, టాలెంట్ మొబిలిటీ, గిగ్ ఎకానమీ, రైతు ఆదాయాన్ని పెంచే అంశాలపై కూడా ప్రత్యేక చర్చా సెషన్లు ఉంటాయి.

Also Read: IAS Pradeep Sharma: ఐఏఎస్ అధికారికి ఐదేళ్ల జైలు శిక్ష

రికార్డు స్థాయిలో పెట్టుబడి ఒప్పందాలు
ఈ సమ్మిట్ ద్వారా పారిశ్రామిక రంగంలో దాదాపు ₹3 లక్షల కోట్లకు పైగా విలువైన పెట్టుబడుల ఒప్పందాలు ఖరారయ్యే అవకాశం ఉంది. సుమారు 50 ప్రతిష్టాత్మక సంస్థలు వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు చేసుకోనున్నాయి. ఇప్పటికే 14 కంపెనీలు లక్ష కోట్ల పెట్టుబడులపై ప్రభుత్వంతో అవగాహన ఏర్పర్చుకున్నాయి. ఈ ఒప్పందాల ప్రకటనలన్నీ సమ్మిట్ సందర్భంగానే వెలువడనున్నాయి.

Telangana Global Summit

ఏర్పాట్లను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి
సమ్మిట్ ఏర్పాట్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించిన అనంతరం ప్రాంగణంలోకి వెళ్లి క్షుణ్ణంగా తనిఖీ చేశారు. 500 ఎకరాల్లో జరుగుతున్న ఈ ఏర్పాట్లలో 2 వేల మంది కూర్చునేలా ప్రారంభ వేదిక, ప్యానల్ చర్చల కోసం ఆరు సెషన్ హాళ్లు, ప్రముఖుల కోసం ఎంఐపీ హాల్ సిద్ధం చేశారు. వివిధ పథకాల ప్రదర్శన కోసం వీడియో టన్నెల్‌తో పాటు 35 ప్రభుత్వ స్టాళ్లను ఏర్పాటు చేశారు.

ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు పలు ముఖ్య ఆదేశాలు జారీ చేశారు. సదుపాయాల్లో ఎలాంటి లోటు రావొద్దని ఆదేశించారు. సమ్మిట్ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలని, మూసీ పునరుజ్జీవనంపై డిజిటల్ చిత్రాలను ప్రదర్శించాలని ఆదేశించారు. అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులు, కేంద్ర మంత్రులు, ఇతర ప్రముఖులు హాజరవుతున్నందున వారికి స్వాగతం, వసతి, ఇతర సదుపాయాల విషయంలో జాగ్రత్తలు వహించాలని సూచించారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *