Goa

Goa: గోవాలో ఘోర అగ్ని ప్రమాదం: సిలిండర్ పేలి 25 మంది మృతి

Goa: గోవాలో శనివారం అర్ధరాత్రి ఒక నైట్‌క్లబ్‌లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో కనీసం 23 మంది మరణించారు. ఉత్తర గోవాలోని ఆర్పొరా గ్రామంలోని ‘బిర్చ్ బై రోమియో లేన్’ క్లబ్‌లో సిలిండర్ పేలడం వల్ల ఈ భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రదేశం రాజధాని పనాజికి సుమారు 25 కి.మీ. దూరంలో ఉంది.

ఘటనా స్థలాన్ని సందర్శించిన గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ మాట్లాడుతూ.. మరణించిన వారిలో ఎక్కువ మంది కిచెన్ సిబ్బంది ఉన్నారని, వీరిలో ముగ్గురు మహిళలు ఉన్నారని తెలిపారు. ఇంకా ముగ్గురు నుంచి నలుగురు పర్యాటకులు కూడా మృతుల్లో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గోవాలోని ఆర్పొరాలో జరిగిన అగ్ని ప్రమాదం తీవ్రంగా కలచివేసింది. ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. ఈ పరిస్థితి గురించి గోవా ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్ జీతో మాట్లాడాను. రాష్ట్ర ప్రభుత్వం బాధితులకు సాధ్యమైన అన్ని సహాయాన్ని అందిస్తోంది” అని ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు.

Also Read: Cricket: సిరీస్ గెలిచిన భారత్..

ఈ అగ్ని ప్రమాదానికి సిలిండర్ పేలుడే కారణమని గోవా పోలీస్ చీఫ్ అలోక్ కుమార్ తెలిపారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని బీజేపీ ఎమ్మెల్యే మైఖేల్ లోబో అన్నారు. మరణించిన వారిలో కొందరు పర్యాటకులు కాగా, ఎక్కువ మంది రెస్టారెంట్ బేస్‌మెంట్‌లో పనిచేసే స్థానిక సిబ్బంది అని ఆయన తెలిపారు.

“గోవాలోని అన్ని క్లబ్‌లకు భద్రతా ఆడిట్ నిర్వహించడం చాలా ముఖ్యం. పర్యాటకులు గోవాను ఎల్లప్పుడూ సురక్షితమైన గమ్యస్థానంగా భావిస్తారు, కానీ ఈ అగ్ని ప్రమాదం చాలా బాధాకరం. భవిష్యత్తులో ఇలాంటి విషాదాలు జరగకూడదు. ఈ సంస్థలలో పర్యాటకుల, కార్మికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. చాలా మంది బేస్‌మెంట్‌లోకి పరిగెత్తడం వల్ల ఊపిరాడక మరణించారు,” అని మైఖేల్ లోబో పేర్కొన్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *