Karnataka

Karnataka: వీకెండ్ లో విషాదం.. హోటల్ స్విమ్మింగ్ పూల్ లో ముగ్గురి మృతి

Karnataka: సెలవులపై మంగళూరుకు వచ్చిన ముగ్గురు టీనేజీ బాలికలు ఓ లగ్జరీ హోటల్‌లోని స్విమ్మింగ్‌ పూల్‌లో మునిగి చనిపోయారు. ఈ ఘటనలో హాస్టల్ యజమాని సహా ఇద్దరిని అరెస్టు చేశారు. 

కర్ణాటక రాష్ట్రం మైసూర్‌కు చెందిన పార్వతి (20), కీర్తన (21), నిషిత (21) అనే ముగ్గురు స్నేహితులు వీకెండ్ కోసం దక్షిణ కన్నడలోని మంగళూరు వచ్చారు. మంగళూరు శివార్లలోని ఉచ్చిల సమీపంలోని బీచ్ సైడ్ లగ్జరీ హోటల్‌లో ఈ ముగ్గురూ బస చేశారు. ఆదివారం ఉదయం 10:00 గంటల ప్రాంతంలో ఈ ముగ్గురూ హోటల్‌లోని 6 అడుగుల లోతున్న స్విమ్మింగ్ పూల్‌లో ఆడుకున్నారు. 

ఈ సమయంలో  ఓ యువతి నీటిలో మునిగిపోయింది. ఆమెను  రక్షించడానికి ప్రయత్నించిన స్నేహితులిద్దరూ మునిగిపోయారు. దీంతో  ముగ్గురూ చనిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బంది సాయంతో యువతుల మృతదేహాలను వెలికితీశారు.

ఇది కూడా చదవండి: Odisha: అత్యాచార కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష

Karnataka: చనిపోయిన ముగ్గురు మహిళలు ఇంజినీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్నారు. ఈత కొట్టడం తెలియక కొలనులోకి దిగడమే ప్రమాదానికి కారణమని మంగళూరు పోలీస్ కమిషనర్ అనుపమ్ అగర్వాల్  చెప్పారు. ఈ లగ్జరీ హోటల్ స్విమ్మింగ్ పూల్‌లో లైఫ్‌గార్డ్స్ లేరని ఆయన తెలిపారు. అలాగే, స్విమ్మింగ్ పూల్ లోతుకు సంబంధించిన ఇన్ఫర్మేటివ్ బోర్డు కూడా లేదన్నారు.  నీటిలో మునిగిన వారి కేకలు విని రక్షించే వారు కూడా ఎవరూ లేకపోవడంతోనే వారి ప్రాణాలు పోయాయని అనుపమ్ అగర్వాల్   వివరించారు.  

విలాసవంతమైన హోటల్ యజమాని మనోహర్ సహా ఇద్దరిని అరెస్టు చేసినట్టు తెలిపారు. అతేకాకుండా హోటల్  లైసెన్స్‌ను తాత్కాలికంగా రద్దు చేసి సీల్ చేసినట్టు కమిషనర్ వెల్లడించారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *