Pm modi: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతూ, భారత్–రష్యా మధ్య స్నేహం శాశ్వతమైందని, రష్యా ఎన్నాళ్లుగానో భారతదేశానికి నమ్మకమైన మిత్రదేశంగా నిలుస్తోందని పేర్కొన్నారు. భారత్ వాణిజ్యాభివృద్ధికి రష్యా నిరంతరం అండగా ఉండటం రెండు దేశాల సంబంధాలను మరింత బలపరుస్తున్నదని అన్నారు.
ఇరుదేశాల ఆర్థిక సంబంధాలు త్వరలోనే కొత్త శిఖరాలకు చేరుకుంటాయని మోడీ అభిప్రాయపడ్డారు. 2030 వరకు ఆర్థిక సహకార అంశాలపై భారత్–రష్యాల మధ్య విస్తృత అంగీకారం కుదిరిందని తెలిపారు. ఈ ఒప్పందాలు భవిష్యత్ వాణిజ్య, పెట్టుబడి, ఆర్థిక రంగాల్లో మైత్రి మరింత పటిష్టం అవుతుందని ఆయన పేర్కొన్నారు.

