Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ మళ్లీ సెట్టవుతోంది. పుష్ప తర్వాత ఈ ఇద్దరూ మరోసారి కలిసి సినిమా చేయడం టాలీవుడ్‌లో సంచలనంగా మారింది. ప్రస్తుతం దుబాయ్‌లో స్క్రిప్ట్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం.
Also Read: Aishwarya Rai: మిస్ వరల్డ్ టైటిల్ నా జీవితాన్ని మార్చేసింది : ఐశ్వర్య రాయ్ బచ్చన్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ‘పెద్ది’ సినిమాలో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం భారీ అంచనాలు సృష్టించింది. అయితే ఈ సినిమా తర్వాత చరణ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ సుకుమార్ దర్శకత్వంలో సెట్ అవుతోంది. రంగస్థలం తర్వాత ఈ క్రేజీ కాంబో మళ్లీ రిపీట్ కావడంతో ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సుకుమార్ రాస్తున్న కథ ఏ స్థాయిలో ఉంటుందన్నది ప్రధాన చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే సుకుమార్ దుబాయ్‌లో స్క్రిప్ట్ వర్క్‌కి శ్రీకారం చుట్టారు. ఇటీవల చరణ్ కూడా దుబాయ్ చేరుకుని సుకుమార్‌తో సుదీర్ఘ చర్చలు జరిపినట్లు సమాచారం. ఇద్దరూ మరింత లోతుగా స్క్రిప్ట్ డిస్కషన్స్ చేస్తున్నట్లు సమాచారం.

