Akhanda 2

Akhanda 2: ‘అఖండ 2’ సినిమా విడుదల వాయిదా! అభిమానులకు నిరాశ

Akhanda 2: నందమూరి బాలకృష్ణ (NBK) అభిమానులకు నిరాశ కలిగించే వార్త ఇది. ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘అఖండ 2 తాండవం’ విడుదల ఆగిపోయింది.
షెడ్యూల్ ప్రకారం ఈ భారీ చిత్రం డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కావాల్సి ఉంది. అయితే, చివరి నిమిషంలో ఈ సినిమా విడుదల వాయిదా పడింది.

గత కొన్ని గంటలుగా ఈ సినిమా విడుదలపై అనేక సందేహాలు, పుకార్లు వినిపించాయి. సినిమా కొన్ని సమస్యల్లో చిక్కుకుందని వార్తలు రావడంతో, గురువారం రాత్రి జరగాల్సిన ప్రీమియర్ షోలను చిత్ర బృందం హఠాత్తుగా రద్దు చేసింది. దీంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. తాజాగా, సినిమా నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ అధికారికంగా ఈ విషయాన్ని ధృవీకరిస్తూ సోషల్ మీడియా వేదికగా (ఎక్స్) ఒక ప్రకటన విడుదల చేసింది.

Also Read: Nagabandham: 20 కోట్లతో రామానాయుడు స్టూడియోస్‌లో ‘నాగబంధం’ హై-వోల్టేజ్ క్లైమాక్స్!

నిర్మాణ సంస్థ ప్రకటనలో ఏముంది?
14 రీల్స్ ప్లస్ సంస్థ తమ పోస్టులో అభిమానులకు క్షమాపణలు చెబుతూ, ఈ నిర్ణయం పట్ల తమ బాధను వ్యక్తం చేసింది. అనివార్యమైన కారణాల వల్ల ‘అఖండ 2’ సినిమా అనుకున్న షెడ్యూల్ ప్రకారం విడుదల కావడం లేదు. ఈ విషయం పట్ల మేము చాలా చింతిస్తున్నాము. ఈ నిర్ణయం తీసుకోవడం మాకు చాలా బాధాకరమైన క్షణం. సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రతి అభిమాని, సినీ ప్రేమికుడి నిరాశను మేము అర్థం చేసుకున్నాము. ఈ సమస్యను త్వరగా పరిష్కరించడానికి మేము అవిశ్రాంతంగా పనిచేస్తున్నాము. ఈ అసౌకర్యానికి మా హృదయపూర్వక క్షమాపణలు. ఈ సమయంలో మీ మద్దతు మాకు చాలా అవసరం. అతి త్వరలో ఒక సానుకూల నిర్ణయంతో మీ ముందుకు వస్తామని హామీ ఇస్తున్నాము.

పాన్ ఇండియా స్థాయిలో విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడటం బాలయ్య అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. త్వరలోనే కొత్త విడుదల తేదీని మేకర్స్ ప్రకటిస్తారని సినీ వర్గాలు ఆశిస్తున్నాయి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *