Jailer 2: సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జైలర్ 2 సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. వచ్చే ఏడాది జూన్ 12న పాన్ ఇండియా రిలీజ్‌కి మేకర్స్ డేట్ లాక్ చేసినట్లు సమాచారం. అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. పూర్తి వివరాలు చూద్దాం.
Also Read: Mana Shankara Varaprasad Garu: మెగాస్టార్ కొత్త పాటతో మళ్లీ సందడి!
రజనీకాంత్ నటిస్తున్న జైలర్ 2 సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావస్తోంది. మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో సీక్వెల్‌పై అంచనాలు ఆకాశాన్నంటాయి. కూలీ తర్వాత రజనీ సినిమాగా రానున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోంది. తాజాగా వచ్చే ఏడాది జూన్ 12న రిలీజ్ డేట్ ఖరారు చేసినట్లు సమాచారం. అయితే ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. శివరాజ్ కుమార్, మోహన్‌లాల్ కీలక పాత్రల్లో నటిస్తుండగా అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఈ రిలీజ్ డేట్ నిజమైతే రజనీ అభిమానులకు బంపర్ గిఫ్ట్‌గా మారనుంది.

