Shamshabad Airport: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA), శంషాబాద్‌లో గురువారం ఉదయం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సాంకేతిక లోపం కారణంగా ఇండిగో (IndiGo) ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఏకంగా 28 విమానాలను రద్దు చేయడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందారు.
హైదరాబాద్ నుంచి ముంబై, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ వంటి ప్రధాన నగరాలకు వెళ్లాల్సిన మొత్తం 28 ఇండిగో విమానాలు రద్దయ్యాయి. విమానాలు రద్దు కావడానికి గల కారణాన్ని ఇండిగో సంస్థ వెల్లడించింది. సాంకేతిక లోపం ముఖ్యంగా తమ విమానయాన సాఫ్ట్‌వేర్‌లో లోపం తలెత్తడం వల్ల ఈ విమానాలను రద్దు చేయాల్సి వచ్చిందని ప్రకటించింది.
ఇది కూడా చదవండి: Earthquake: అఫ్గానిస్థాన్‌లో 4.1 తీవ్రతతో భూకంపం
విమానాలు రద్దు కావడంతో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో దాదాపు 2,000 మంది ప్రయాణికులు నిరీక్షిస్తున్నారు. అయితే, తమ విమానాలు రద్దు అయిన విషయంపై ఇండిగో సంస్థ ముందుగా ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్లైట్స్ రద్దు కావడంతో తాము గమ్యస్థానాలకు చేరడంలో జాప్యం జరుగుతుందని ఆందోళన చెందారు.
విమానాల రద్దుకు సరైన సమాధానం, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో ప్రయాణికులు ఇండిగో సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఎయిర్‌పోర్ట్‌లో పరిస్థితి కాసేపు అదుపు తప్పింది. తమ ప్రయాణానికి అయిన ఇబ్బందికి, సమయం వృథా అయినందుకు ప్రయాణికులు ఇండిగో యాజమాన్యాన్ని నిలదీశారు.

