Rashmika

Rashmika: అలాంటి వారికి కఠిన శిక్ష విధించాలి: ఏఐ దుర్వినియోగంపై రష్మిక

Rashmika: దేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో, కొందరు దీన్ని సెలబ్రిటీల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించేందుకు దుర్వినియోగం చేస్తున్నారు. ముఖ్యంగా సినీ తారల ఫోటోలు, వీడియోలను అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఇటీవల ఆందోళన కలిగిస్తోంది. ఈ సమస్యపై ఇప్పటికే నటీమణులు కీర్తి సురేశ్, గిరిజా ఓక్ వంటివారు స్పందించగా, తాజాగా పాన్ ఇండియా స్టార్ రష్మిక మందన్న కూడా దీనిపై తీవ్రంగా స్పందించారు.

‘నేషనల్ క్రష్’గా అభిమానాన్ని చూరగొన్న రష్మిక మందన్న, AI దుర్వినియోగంపై తన అధికారిక సోషల్ మీడియా వేదిక (X – ట్విట్టర్) ద్వారా గళం విప్పారు. ఆమె తన పోస్ట్‌లో ‘సైబర్ దోస్త్’ ఖాతాను ట్యాగ్ చేస్తూ, ప్రజలకు ఒక ముఖ్యమైన సందేశాన్ని అందించారు.

Also Read: The Raja Saab: ‘ది రాజాసాబ్’ రన్‌టైమ్ లీక్.. బుకింగ్స్ స్టార్ట్?

ఏఐ అనేది మన అభివృద్ధికి, పురోగతికి ఒక శక్తి లాంటిది. కానీ, కొంతమంది వ్యక్తులు ఈ సాంకేతికతను మహిళలను లక్ష్యంగా చేసుకుని, అసభ్యతను సృష్టించడానికి దుర్వినియోగం చేస్తున్నారు. ఇది వారిలోని నైతిక విలువలు పతనమవుతున్నాయనే విషయాన్ని సూచిస్తుంది అని రష్మిక పేర్కొన్నారు.

రష్మిక తన పోస్ట్‌లో ఇంటర్నెట్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. “ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి, ఇంటర్నెట్ అనేది ఇకపై నిజాన్ని చూపించే అద్దం కాదు. అది ఏదైనా కల్పించగలిగే (సృష్టించగలిగే) ఒక కాన్వాస్” అని ఆమె అన్నారు. అంటే, ఇంటర్నెట్‌లో కనిపించే ప్రతీది నిజం కాదని, టెక్నాలజీ ద్వారా దేన్నైనా సృష్టించవచ్చని ఆమె హెచ్చరించారు.

దుర్వినియోగానికి తావివ్వకుండా, మనం బాధ్యతగా ముందుకు సాగి, మరింత గౌరవప్రదమైన మరియు మెరుగైన సమాజాన్ని నిర్మించడానికి ఏఐ (AI) ని వినియోగించుకుందాం. ఇక్కడ మనం నిర్లక్ష్యం కంటే బాధ్యతను ఎంచుకోవాలి అని రష్మిక సూచించారు. అంతేకాకుండా, “ప్రజలు మనుషుల్లా వ్యవహరించలేకపోతే, అలాంటివారికి కఠినమైన, క్షమించరాని శిక్షలు విధించాలి” అంటూ ఆమె చట్టపరమైన చర్యలను డిమాండ్ చేశారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *