Delhi: తప్పనిసరి కాదు.. వెనక్కి తగ్గిన కేంద్రం..

Delhi: సంచార్ సాథీ యాప్‌ను కొత్త స్మార్ట్‌ఫోన్‌లలో ప్రీ-ఇన్‌స్టాల్ చేయాలని కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను వెనక్కి తీసుకుంది. నవంబర్ 28న టెలికమ్యూనికేషన్స్ విభాగం జారీ చేసిన ఈ ఉత్తర్వులు తీవ్ర వివాదానికి దారితీశాయి. ముఖ్యంగా ప్రతిపక్షాలు, ఈ యాప్ ఫోన్‌లోని వ్యక్తిగత గోప్యతను ఉల్లంఘించే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశాయి.

 

ఈ నేపథ్యంలో, ప్రీ-ఇన్‌స్టలేషన్ ఇక తప్పనిసరి కాదని కేంద్రం స్పష్టీకరించింది. యాప్‌ను ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసినప్పటికీ, వినియోగదారులు దాన్ని ఎప్పుడైనా తొలగించుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. రిజిస్టర్ చేసిన తర్వాతే ఇది పనిచేస్తుందని కూడా వివరించింది.

 

సైబర్ నేరాలను అరికట్టడమే లక్ష్యంగా సంచార్ సాథీ యాప్‌ను ప్రవేశపెట్టినప్పటికీ, గోప్యతా భంగం భయాలు తగ్గకపోవడంతో కేంద్రం వెనక్కి తగ్గినట్లు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా, ఇప్పటి వరకు 1.5 కోట్లకు పైగా వినియోగదారులు ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నట్లు సమాచారం.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *