Akhanda 2: నందమూరి బాలకృష్ణ ‘అఖండ 2’ సినిమా టికెట్ ధరల పెంపుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. డిసెంబర్ 4 ప్రీమియర్ షో రూ.600 వరకు ఉండనుంది. మొదటి 10 రోజులు పెంపు అమలులో ఉంటుంది.
Also Read: Bigg Boss 9 Telugu: ఎలాగైనా డీమాన్ పై గెలవాలి.. భరణి తో చేతులు కలిపిన తనూజ
బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న ‘అఖండ 2 తాండవం’ చిత్రానికి ఏపీ ప్రభుత్వం టికెట్ ధరల పెంపుకు జీవో జారీ చేసింది. డిసెంబర్ 4 ప్రీమియర్ షో గరిష్ఠం రూ.600, 5వ తేదీ నుంచి మల్టీప్లెక్స్‌లలో రూ.100, సింగిల్ స్క్రీన్లలో రూ.75 పెంపు అనుమతించింది. మొదటి 10 రోజుల వరకు ఈ ధరలు వర్తిస్తాయి. ఈ సినిమా 2డీ, 3డీ ఫార్మాట్లలో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. టీజర్, ట్రైలర్, పాటలతో ఇప్పటికే అంచనాలు ఆకాశాన్నంటాయి. థమన్ సంగీతం సినిమాకు మరింత హైలైట్ అవుతోంది. రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మాణంలో తేజస్విని నందమూరి సమర్పిస్తున్న ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ అవుతుందన్న నమ్మకం అభిమానుల్లో ఉంది.
