Kakinada:బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం బలహీనపడినా, వచ్చే రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. నెల్లూరు, తిరుపతి పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది.
తీరం వెంట బలమైన ఈదురుగాలులు వీచే అవకాశంతో, మత్స్యకారులు సముద్రానికి వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
దక్షిణ కోస్తా ప్రాంతంలోని పోర్టులకు మూడో నెంబర్ హెచ్చరిక జారీ చేయగా, ఉత్తర కోస్తాలోని పోర్టుల్లో మొదటి నెంబర్ హెచ్చరిక అమల్లో ఉంది. కాకినాడ పోర్టుకు రెండో ప్రమాద హెచ్చరిక ప్రకటించారు.
