Komatireddy Venkata Reddy: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కోస్తా వ్యాఖ్యల మంటలు ఇప్పట్లో చల్లారేలా లేవు. ఇప్పటికే ఒక్కొక్కరుగా తెలంగాణ నేతలు ఆయనపై మండిపడుతుండగా, తాజాగా రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి, జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ తదితరులు పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఓ దశలో ఆయన క్షమాపణ చెప్పాల్సిందేనన్న డిమాండ్లు వినిపించారు.
Komatireddy Venkata Reddy: తాజాగా పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పందించారు. పవన్ కల్యాణ్ తెలిసీ తెలియకుండా ఏదేదో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాల్సిందేనని పవన్ కల్యాణ్‌ను డిమాండ్ చేశారు. లేకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హెచ్చరించారు.
Komatireddy Venkata Reddy: పవన్ కల్యాణ్ తన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్తే ఆయన తీసే సినిమా ఒకటి రెండు రోజులు ఆడుతుందని, లేదంటే సినిమాలే ఆడవని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హెచ్చరించారు. పవన్ వ్యాఖ్యల వల్ల తెలంగాణ ప్రజలు బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైదరాబాద్ నుంచి వచ్చే ఆదాయాన్ని విశాఖ పట్నం, కాకినాడ, తిరుపతికే వాడుకున్నారని సంచలన ఆరోపణ చేశారు.
Komatireddy Venkata Reddy: ప్రత్యేక రాష్ట్రం వచ్చాక బీఆర్ఎస్ పాలనలో తీవ్ర నష్టం జరిగిందని, ఇప్పుడిప్పుడే కోలుకుంటుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. ఇదే సమయంలో పవన్ కల్యాణ్ సోదరుడైన మెగాస్టార్ చిరంజీవి గురించి ఆయన పొగడటం విశేషం. చిరంజీవి సూపర్ మ్యాన్ అని కొనియాడారు. ఆయనకు రాజకీయాలతో సంబంధం లేదని గుర్తు చేశారు. ఎవరైనా అన్నీ తెలుసుకొని మాట్లాడితే మంచిదని పవన్ కల్యాణ్‌కు హితవు పలికారు.
