Tamannaah: మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా మరో పవర్ఫుల్ రోల్లో కనిపించనుంది. ప్రముఖ దర్శకుడు వీ శాంతారాం జీవిత కథాంశంపై తెరకెక్కుతున్న బయోపిక్‌లో ఆమె కీలక పాత్ర పోషిస్తోంది. ఇటీవల కాలంలో తమన్నా ఎంచుకుంటున్న పాత్రలు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. ఓదెల రైల్వే స్టేషన్-2లో శక్తివంతమైన పాత్రతోనూ, రైడ్-2లో కీలక క్యారెక్టర్‌తోనూ ప్రేక్షకుల్ని మెప్పించింది. ఇప్పుడు బాలీవుడ్లో ప్రముఖ దర్శకుడు వీ శాంతారాం జీవిత కథపై రూపొందుతున్న బయోపిక్ ‘చిత్రపతి వీ శాంతారాం’లో తమన్నా ముఖ్య పాత్రలో నటిస్తోంది.
Also Read: Nagachaitanya: సమంత దూరమయ్యాక మరోసారి స్పందించిన నాగచైతన్య
ఈ చిత్రంలో శాంతారాం భార్య సంధ్యగా కనిపించనుంది. యువ నటుడు సిద్ధాంత్ చతుర్వేది శాంతారాం పాత్రలో నటిస్తున్నాడు. అభిజిత్ దేశ్‌పాండే దర్శకత్వం వహిస్తున్నారు. కథ వినగానే తమన్నా ఈ భావోద్వేగ పాత్రకు ఒప్పుకున్నారు. శాంతారాం చేసిన ప్రయోగాలు, భారతీయ సినిమాకు అందించిన సేవలను నిజాయితీగా చూపించేందుకు చిత్రబృందం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ బయోపిక్ బాలీవుడ్లో మరో విజయవంతమైన చిత్రంగా నిలుస్తుందని చర్చ నడుస్తోంది. తమన్నా ఈ పాత్రలో ఎలా మెరుస్తుందన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.

