Yellamma: బలగం విజయంతో స్ట్రాంగ్ దర్శకుడిగా టాలీవుడ్ లో నిలదొక్కుకున్న వేణు యెల్డండి తదుపరి చిత్రం ఎల్లమ్మతో రాబోతున్నాడు. హీరో హీరోయిన్ల పేర్లు ఎప్పుడూ మారుతూ ఉండటంతో సినిమాపై సస్పెన్స్ మొదలైంది. అసలు ఈ సినిమా గురించి మేకర్స్ క్లారిటీ కోసం నెటిజన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న క్రమంలో, తాజాగా నిర్మాత దిల్ రాజు స్పష్టత ఇచ్చారు.
Also Read: Peddi Update: పెద్ది నెక్స్ట్ సాంగ్ నార్మల్ గా ఉండదు.. షూట్ అక్కడే
బలగం సక్సెస్ తర్వాత దర్శకుడు వేణు యెల్డండి రెండో చిత్రం ఎల్లమ్మపై ఫోకస్ పెట్టారు. గత కొంతకాలంగా ఈ సినిమా హీరో ఎవరు అనే చర్చ హాట్ టాపిక్‌గా మారింది. నాని, నితిన్, కీర్తి సురేష్, సాయి పల్లవి పేర్లు వినిపించినా ఎవరూ ఫిక్స్ కాలేదు. తాజాగా దేవి శ్రీ ప్రసాద్ హీరోగా ఎంట్రీ ఇస్తారనే ప్రచారం జోరుగా ఉంది. అయితే ఇంకా అధికారికంగా నిర్ధారణ కాలేదు. ఈ నేపథ్యంలో నిర్మాత దిల్ రాజు స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు. ఎల్లమ్మ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన తదుపరి 10 రోజుల్లో వెల్లడిస్తామని తేల్చి చెప్పారు. అంతేకాదు ఈ చిత్రాన్ని 2026లో భారీ స్థాయిలో విడుదల చేయనున్నట్లు కూడా ప్రకటించారు. దీంతో ఎల్లమ్మపై అంచనాలు మరింత పెరిగాయి.

