Sangareddy: వారిద్దరూ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి కూడా చేసుకోవాలని భావించారు. ఇద్దరు కులాలు వేరు కావడంతో పెద్దలను ఒప్పించి చేసుకుందామని అనుకున్నారు. ఇలా ఆ ప్రేమజంట కలలు కంటూ ఊహాలోకంలో విహరిస్తుండగా, పంచాయతీ ఎన్నికలు రానే వచ్చేశాయి. అది కూడా ఆ యువతి సామాజిక వర్గానికి రిజర్వేషన్ అయింది. ఆ యువకుడిలో ఓ ఆలోచన రగిలింది. ఆ ఆలోచనను ఆ ప్రేమ జంట అమలు చేసి చూపింది.
Sangareddy: సంగారెడ్డి జిల్లా తాళ్లపల్లి గ్రామానికి చెందిన చంద్రశేఖర్, శ్రీజ గత కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఆ ఊరు ఈ సారి శ్రీజ సామాజికవర్గానికి రిజర్వ్ కావడంతో తెలిసిన వెంటనే రాత్రికి రాత్రే వారిద్దరూ ఒక్కటయ్యారు. యాదగిరిగుట్ట ఆలయానికి వెళ్లి పెళ్లి చేసుకొని తెల్లారేసరికి ఊరికి వచ్చేశారు. ఇక ఆ ఇద్దరూ ఒక్కటయ్యారు. ఊరిలో జనంతో తన మనసులోని మాట చంద్రశేఖర్ బయటపెట్టాడు.
Sangareddy: తాను పెళ్లి చేసుకున్న శ్రీజతో పోటీ చేయించేందుకు ఆ ఊరిలో ఒక వర్గం ఒప్పుకున్నది. మద్దతు ఇచ్చేందుకు ముందుకొచ్చింది. ఆ మద్దతు చాలు నామినేషన్ ఏసి తీరుతాం.. అని శ్రీజతో చంద్రశేఖర్ నామినేషన్ వేయించి వచ్చేశాడు. ఇదే సమయంలో ఆ యువతి తల్లిదండ్రులకు శ్రీజ పోటీ చేయడం, ఆమె పెళ్లి చేసుకోవడం ఇష్టంలేక పోలీస్‌స్టేషన్ మెట్లెక్కారు.
Sangareddy: తాను మేజర్‌నని, తన ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నానని పోలీసులకు, తన తల్లిదండ్రులకు తేల్చి చెప్పింది శ్రీజ. నామినేషన్‌ను ఉపసంహరించుకోవాలని ఆమె తల్లిదండ్రులు ఎంతగా ప్రయత్నించినా ససేమిరా అన్నది. తన భర్త, గ్రామస్థుల సహకారంతో సర్పంచ్‌గా తాను గెలుస్తానని, ప్రజలు సహకరిస్తే గ్రామ అభివృద్ధికి పాటుపడతానని, గ్రామ భవిష్యత్తే తన భవిష్యత్తు అని శ్రీజ చెప్పి ప్రచారంలోకి దిగిపోయింది. ఇదన్నపేట మ్యాటర్.

