Kiara Advani: బాలీవుడ్ స్టార్ జంట సిద్ధార్థ్ మల్హోత్ర – కియారా తమ పాప పేరును అధికారికంగా ప్రకటించారు. జులై 15న జన్మించిన బిడ్డకు సరాయా మల్హోత్ర అని పేరు పెట్టారు. షేర్‌షా సినిమాతో ప్రేమలో పడి, 2023 ఫిబ్రవరి 7న వివాహం చేసుకున్న సిద్ధార్థ్ – కియారా జంట ఈ ఏడాది జులై 15న తల్లిదండ్రులయ్యారు. ఇన్ని నెలలుగా పాప పేరు ఏమిటన్న ఉత్కంఠ నెలకొనగా, తాజాగా ఆ జంట అధికారిక ప్రకటన విడుదల చేసింది. “మా యువరాణి పేరు సరాయా మల్హోత్ర” అని పెట్టాం. అందరి ఆశీస్సులు కావాలి” అని వారు తెలిపారు. ఈ ప్రకటనతో ఇరు వర్గాల అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. తెలుగులో మహేష్ బాబు, రామ్ చరణ సరసన నటించి మంచి క్రేజ్ సంపాదించిన కియారా ఇటీవల వార్-2లోనూ కనిపించింది. సిద్ధార్థ్ మల్హోత్ర కూడా బాలీవుడ్‌లో యూత్ హీరోగా గుర్తింపు పొందాడు.

