Cyclone warning: ఆంధ్రప్రదేశ్ సహా సమీప రాష్ట్రాలను మరో తుఫాన్ భయపెడుతున్నది. దిత్వా తుఫాన్ ప్రభావంతో శ్రీలంక దేశం అతలాకుతలం అవుతున్నది. ఈ తుఫాన్ ప్రభావంతో ఇప్పటివరకూ ఆ దేశంలో సుమారు 64 మంది వరకు మృత్యువాత పడ్డారని సమాచారం. ఇప్పటికీ భారీ వర్షాలతో జనజీవనం స్తంభించింది. దీని ప్రభావంతో తమిళనాడు రాష్ట్రం కూడా వణుకుతున్నది. పలు రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వం పాఠశాలలకు సెలవులు ప్రకటించింది.
Cyclone warning: ఆదివారం ఉదయం అది తీవ్ర వాయుగుండంగా మారి తీరం దాటనున్నది. తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తాంధ్ర తీరాలకు చేరుకుంటుంది. దిత్వా తుఫాన్ ప్రభావంతో దక్షిణ కోస్తాలోని నెల్లూరు, రాయలసీమలోని చిత్తూరు, కడప జిల్లాలకు హెచ్చరికలు జారీచేశారు. వీటితోపాటు కడప, ప్రకాశం, అన్నమయ్య జిల్లాలకు ప్రభావం ఉంటుంది. ఆయా జిల్లాల్లో భారీ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నది.
Cyclone warning: కర్నూలు, బాపట్ల, పల్నాడు, నంద్యాల, శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నది. ఇటు తెలంగాణకు ప్రభావం చూపుతుందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇప్పటికే దిత్వా ప్రభావంతో రాష్ట్రంలో చలిగాలులు వీస్తున్నాయి. రేపటి నుంచి మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని తెలిపింది. డిసెంబర్ 2 నుంచి 5 వరకు దక్షిణ తెలంగాణ, తూర్పు ప్రాంతాలపై తుఫాన్ ప్రభావం ఉంటుంది.

