Panchayat Elections: తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల కోలాహలం సందడిగా ఉన్నది. మూడు విడతల్లో ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రక్రియ చేపట్టింది. ఈ మేరకు తొలి విడత నామినేషన్ల ప్రక్రియకు ఈ రోజుతో గడువు ముగియనున్నది. మలి విడత నామినేషన్ల ప్రక్రియ ఇదే రోజుతో మొదలై డిసెంబర్ 2 వరకు ఉంటుంది. ఈ దశలో పంచాయతీ ఎన్నికల్లో పాల్గొనే సర్పంచ్, వార్డు అభ్యర్థులకు కేటాయించే గుర్తులను ఎన్నికల సంఘం జారీ చేసినట్టు సమాచారం.
Panchayat Elections: సర్పంచ్ స్థానాల్లో పోటీచేసే అభ్యర్థుల కోసం 30 గుర్తులు, వార్డు అభ్యర్థుల కోసం 20 గుర్తులను జారీ చేసినట్టు తెలుస్తున్నది. ఈ సారి ఆఖరున నోటా గుర్తును కూడా కేటాయించినట్టు తెలిసింది. రాష్ట్రంలో 12,728 గ్రామ పంచాయతీలు, 1.12 లక్షల వార్డులు ఉన్నాయి. మూడో విడత నామినేషన్ల ప్రక్రియకు ఆఖరు రోజు డిసెంబర్ 5. అదే రోజు ఆయా గుర్తులను కేటాయిస్తారు.
Panchayat Elections: అభ్యర్థులు సమర్పించిన నామినేషన్ ఫారంలో పొందుపర్చిన విధంగా తెలుగు అక్షర క్రమంలో ఇంటి పేరు కాకుండా అభ్యర్థి పేరును పరిగణనలోకి తీసుకొని వరుస క్రమంలో ఉంచుతారు. ఈ మేరకు ఇప్పటికే ముద్రించి ఉన్న బ్యాలెట్ పేపర్లపై గుర్తులు ఉంటాయి. మొదటి అభ్యర్థికి ఎన్నికల సంఘం జారీచేసిన ప్రాధాన్యక్రమంలో గుర్తులను కేటాయిస్తారు.
సర్పంచ్ అభ్యర్థులకు కేటాయించే గుర్తులు ఇవే..
Panchayat Elections: ఉంగరం, కత్తెర, బ్యాట్, ఫుట్‌బాల్, లేడీ పర్సు, టీవీ రిమోట్, టూత్‌పేస్ట్, స్పాన్సర్, చెత్తడబ్బా, నల్లబోర్డు, బెండకాయ, కొబ్బరితోట, వజ్రం, బకెట్, డోర్ హ్యాండిల్స్, టీ జల్లెడ, చేతికర్ర, మంచం, పలక, టేబుల్, బ్యాటరీ లైట్, బ్రష్, బ్యాట్స్‌మాన్, మనిషి తెరచాప, పడవ, బిస్కట్, వేణువు, చెయిన్, చెప్పులు, బెలూన్, వికెట్లు.
వార్డు అభ్యర్థులకు కేటాయించే గుర్తులు ఇవే..
Panchayat Elections: గౌను, గ్యాస్ స్టవ్, స్టూల్, గ్యాస్ సిలిండర్, బీరువా, విజిల్, కుండ, డిష్ యాంటినా, గరాటా, మూకుడు, ఐస్ క్రీమ్, గాజు గ్లాసు, పోస్టు డబ్బా, ఎన్వొలప్ కవర్, హాకీ బ్యాటు బంతి, నెక్ టై, కటింగ్ ప్లేయర్, పెట్టె, విద్యుత్తు స్తంభం, కెటిల్.
