Stranger Things 5

Stranger Things 5: స్ట్రేంజర్ థింగ్స్ 5: ప్రపంచమే షేకింగ్!

Stranger Things 5: ప్రపంచవ్యాప్తంగా భారీ క్రేజ్ ఉన్న ‘స్ట్రేంజర్ థింగ్స్’ సిరీస్ ఐదో సీజన్ ఓటీటీలో రిలీజ్ అయింది. కేవలం నాలుగు ఎపిసోడ్స్‌తోనే ఈ సిరీస్ 91 దేశాల్లో నెంబర్ వన్ సిరీస్ గా ట్రెండ్ అవుతుంది. ఆ నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ సిరీస్ ‘స్ట్రేంజర్ థింగ్స్’కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. నాలుగు సీజన్ల తర్వాత ఐదో సీజన్ ఇటీవల రిలీజ్ అయిన విషయం తెలిసిందే. కేవలం మొదటి నాలుగు ఎపిసోడ్స్‌తోనే ఈ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఏకంగా 91 దేశాల్లో నెంబర్ వన్ స్థానంలో ట్రెండ్ అవుతూ రికార్డు సృష్టించింది. సౌత్ కొరియా, జపాన్ దేశాల్లో మాత్రమే నెంబర్ టూ స్థానంలో నిలిచింది. మిగతా అన్ని దేశాల్లోనూ టాప్ ప్లేస్‌లో ఉంది. ఈ సిరీస్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్‌లో ఉందో ఈ ఒక్క గణాంకం చూస్తేనే అర్థమవుతుంది. ఈ సీజన్‌లో కథ మరింత థ్రిల్లింగ్‌గా సాగుతూ ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. ఇక మిగతా ఎపిసోడ్స్ రిలీజ్ అయ్యాక ఈ రికార్డు మరింత ఎక్కువకు వెళ్తుందని అంచనా వేస్తున్నారు.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *