Pawan Kalyan: విశాఖపట్నంలో నేడు నౌకాదళ వేడుకల సందడి నెలకొననుంది. ప్రతి సంవత్సరం డిసెంబర్ 4న జరిగే నేవీ డే కార్యక్రమాల కోసం ఈసారి కూడా సముద్ర నగరం ప్రత్యేకంగా సిద్ధమైంది. ఈ వేడుకలకు సంబంధించిన ముందస్తు కార్యక్రమాల్లో ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొనడానికి విశాఖకు చేరుకుంటున్నారు.
ఈరోజు సాయంత్రం 4.30 గంటలకు పవన్ కళ్యాణ్ విశాఖ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అక్కడి నుంచి షీలానగర్ మారుతీ కూడలి మీదుగా ఈస్టర్న్ నావల్ కమాండ్ ప్రధాన కార్యాలయానికి వెళ్లనున్నారు. అనంతరం సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఐఎన్ఎస్ సముద్రికలో జరిగే ప్రత్యేక కార్యక్రమాలకు ఆయన హాజరు కానున్నారు.
Also Read: Meesho IPO: మీషో ఐపీఓ డేట్ ఫిక్స్.. ప్రైస్ బ్యాండ్ రూ.105-111 మాత్రమే
భారత నౌకాదళం ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన ఈ సంధర్బ కార్యక్రమాల్లో సముద్ర భద్రత, యుద్ధ సామర్థ్యాల ప్రదర్శనలు, నౌకాదళ సిబ్బంది ప్రతిభను చూపించే విన్యాసాలు ఉండనున్నాయి. పవన్ కళ్యాణ్ హాజరుకానున్న నేపథ్యంలో అభిమానులు, జనసేన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకునే అవకాశం ఉంది. నౌకాదళ అధికారులతో పాటు, వారి కుటుంబ సభ్యులను పవన్ కళ్యాణ్ కలవొచ్చని సమాచారం. ఈ కారణంగా మొత్తం విశాఖ నేడు నేవీ డే శోభతో రంజిల్లనుంది.
