Akhanda Roxx

Akhanda Roxx: ‘అఖండ 2’ సంచలనం.. బాలయ్య మాస్ ఇమేజ్‌కు ప్రత్యేక వాహనం ‘అఖండ రాక్స్’!

Akhanda Roxx: మాస్ సినిమాల దర్శకుడు బోయపాటి శ్రీను మరియు నటసింహం నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరూ కలిస్తే బాక్సాఫీస్ వద్ద విజయం ఖాయం. వీరి కలయికలో ఇప్పటికే మూడు సినిమాలు బ్లాక్ బస్టర్‌లుగా నిలవగా, తాజాగా రాబోతున్న అఖండ 2 సినిమాపై అభిమానుల అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో డిసెంబర్ 5న విడుదల కానుంది.

ఈ భారీ అంచనాల మధ్య, చిత్ర బృందం నుంచి ఒక అద్భుతమైన వార్త బయటకు వచ్చింది. ఈ సినిమాలో బాలకృష్ణ పాత్ర కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఒక పవర్ ఫుల్ వాహనాన్ని ఇటీవల అఖండ రాక్స్ పేరుతో గ్రాండ్‌గా లాంచ్ చేశారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో డైరెక్టర్ బోయపాటి శ్రీను తన టీమ్‌తో కలిసి పాల్గొన్నారు.

ఈ ‘అఖండ రాక్స్’ వాహనాన్ని అత్యాధునిక ఇంజనీరింగ్‌తో XDrive సంస్థ నిర్మించగా, X Studios సినిమాటిక్ లుక్‌ను ఇచ్చింది. ఈ వాహనం బాలకృష్ణ గారి పాత్ర యొక్క పవర్, మాస్ ఎనర్జీకి అద్దం పట్టేలా తీర్చిదిద్దారు. హీరో స్క్రీన్ ప్రెజెన్స్‌కు తగ్గట్టుగా, కథకు సరిపోయే విధంగా దీని డిజైన్ చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడిన డైరెక్టర్ బోయపాటి శ్రీను, ఈ వాహనం డిజైన్ పట్ల చాలా సంతృప్తి వ్యక్తం చేశారు. పవర్ ఫుల్ పాత్ర దిగి వస్తుంటే, దానికి తగ్గ బలమైన వస్తువు ఒకటి ఉండాలనే ఉద్దేశంతో దీనిని తయారు చేయించామని చెప్పారు. బాలకృష్ణ పాత్ర ఎంత శక్తివంతంగా ఉంటుందో, ఈ వాహనం కూడా అంతే శక్తివంతంగా ఉంటుందని తెలిపారు. ఈ వాహనాన్ని అద్భుతంగా డిజైన్ చేసిన అమర్ అనే వ్యక్తిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. అమర్ నాలుగు రోజులు పగలు రాత్రి కష్టపడి ఈ డిజైన్‌ను తయారు చేశారని, ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.

తెరపై ఈ వాహనాన్ని చూసినప్పుడు ప్రేక్షకులు ఖచ్చితంగా మెస్మరైజ్ అవుతారని, గర్వంగా ఫీల్ అవుతారని బోయపాటి శ్రీను అన్నారు. అంతేకాకుండా, అఖండ 2 అనేది కేవలం సినిమా మాత్రమే కాదు, ఇది భారతదేశపు ఆత్మ అని పేర్కొన్నారు. సినిమా చూసిన తర్వాత ఈ విషయం అందరికీ అర్థమవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *