IND vs SA

IND vs SA: 408 పరుగుల భారీ తేడాతో ఓటమి .. భారత్ చెత్త రికార్డు

IND vs SA: స్వదేశంలో టెస్ట్ క్రికెట్‌లో టీమిండియాపై చెరిగిపోని మచ్చ పడింది. దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ జట్టు ఏకంగా 408 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది. పరుగుల తేడాతో భారత గడ్డపై టీమిండియాకు ఇదే టెస్ట్ క్రికెట్ చరిత్రలో అతిపెద్ద పరాజయంగా నిలిచింది.దక్షిణాఫ్రికా నిర్దేశించిన 549 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో భారత బ్యాటర్లు పూర్తిగా చేతులెత్తేశారు. టీమిండియా కేవలం 140 పరుగులకే ఆలౌట్ కావడంతో, 408 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా చారిత్రక విజయాన్ని నమోదు చేసింది.

ఈ ఓటమితో గత 20 సంవత్సరాలుగా పదిలంగా ఉన్న ఒక ప్రతికూల రికార్డు బద్దలైంది.చివరిసారిగా 2004లో ఆస్ట్రేలియా జట్టు భారత్‌ను నాగ్‌పూర్ టెస్ట్‌లో 342 పరుగుల తేడాతో ఓడించింది. అప్పటినుంచి స్వదేశంలో భారత్‌కు ఇంత భారీ పరాజయం ఎదురుకాలేదు.408 పరుగుల తేడాతో ఓటమి చెందడం ద్వారా, భారత జట్టు తన అత్యంత ఘోరమైన స్వదేశీ ఓటమి రికార్డును మరింత దిగజార్చుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో బౌలర్లు, రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటర్లు పూర్తిగా వైఫల్యం చెందడమే ఈ ఘోర పరాజయానికి ప్రధాన కారణం.

ఇది కూడా చదవండి: TG High Court: హైడ్రాపై హైకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం

తొలి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా భారీ స్కోరు సాధించి 400కు పైగా పరుగుల లీడ్ సంపాదించింది. రెండో ఇన్నింగ్స్‌లో లక్ష్య ఛేదనకు దిగిన భారత్ జట్టులో ఏ ఒక్క బ్యాటర్ కూడా క్రీజులో నిలబడలేకపోయాడు. దక్షిణాఫ్రికా స్పిన్నర్లు, పేసర్లు సంయుక్తంగా భారత బ్యాటింగ్‌ను చిన్నాభిన్నం చేశారు. ఈ సిరీస్‌లో ఎదురైన వైట్‌వాష్ , స్వదేశంలో అతిపెద్ద ఓటమి భారత క్రికెట్ బోర్డు (BCCI)ను పునరాలోచనలో పడేసే అవకాశం ఉంది. రాబోయే మ్యాచ్‌లకు కోచ్, కెప్టెన్ వ్యూహాలపై సమీక్ష తప్పదని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *