Drugs Case

Drug Bust: మాదాపూర్‌లో డ్రగ్స్ కలకలం: ఇద్దరు అరెస్ట్!

Drug Bust: మాదాపూర్ ప్రాంతంలో డ్రగ్స్ అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను మాదాపూర్ స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ (SOT) పోలీసులు అరెస్టు చేశారు. కొత్త సంవత్సరం వేడుకలను లక్ష్యంగా చేసుకుని డ్రగ్స్ సరఫరాకు ప్రయత్నిస్తున్న సమయంలో పోలీసులు వీరిని పట్టుకున్నారు. నిందితుల నుంచి పోలీసులు 14 గ్రాముల ఎండీఎంఏ (MDMA) డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీనితో పాటు, ఇద్దరు నిందితుల వద్ద నుంచి రెండు సెల్‌ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు.

ఇది కూడా చదవండి: Hong Kong Fire Accident: చరిత్రలోనే భారీ అగ్ని ప్రమాదం.. 44 మంది మృతి.. 279 మంది మిస్సింగ్..

నిందితులు ఈ డ్రగ్స్‌ను బెంగళూరు,గోవా వంటి ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు తీసుకువస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా నూతన సంవత్సర వేడుకల సమయంలో జరిగే పార్టీలలో విక్రయించేందుకు ఈ డ్రగ్స్ తరలిస్తున్నట్లు నిందితులు విచారణలో వెల్లడించారు. మాదాపూర్ ఎస్‌వోటీ పోలీసులు కేసు నమోదు చేసి, నిందితులను రిమాండ్‌కు తరలించారు. ఈ డ్రగ్స్ నెట్‌వర్క్‌లో ఇంకా ఎంతమంది పాలుపంచుకున్నారనే దానిపై దర్యాప్తు కొనసాగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *