Telangana:18 సంవత్సరాల వయసు ఉండి.. రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళకు ఇందిరమ్మ చీర అందుతుంది.. ఇప్పటివరకు మహిళా సంఘాల సభ్యులకే చీరలు అన్న అనుమానాలకు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్న ప్రభాకర్ పటాపంచెలు చేశారు. ఇందిరా మహిళా శక్తి పేరుతో అందజేసే చీరలను రేషన్‌కార్డు ఉన్న ప్రతి మహిళకు అందజేస్తామని నిన్న ఆయన ప్రకటించారు.
Telangana:మహిళా సంఘంలోని సభ్యులకు ప్రతి ఇంటికీ వెళ్లి బొట్టుపెట్టి చీరను అందజేస్తామని మంత్రి ప్రకటించారు. మహిళా సంఘాలకు మరింత ప్రోత్సాహం అందించేందుకు పదేండ్లపాటు వడ్డీలేని రుణాలను అందిస్తున్నట్టు ప్రకటించారు. మహిళలు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు వీలుగా పెట్రోల్ బంకులు, సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు సహకారం అందిస్తున్నట్టు ప్రకటించారు.
Telangana:వాస్తవంగా ఇందిరమ్మ చీరలపై క్షేత్రస్థాయిలోని గ్రామాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వం తెల్లరేషన్‌కార్డు ఉన్న మహిళలందరికీ ఇందిరమ్మ చీరలు అందిస్తామని ప్రకటించింది. కొన్నిచోట్ల అధికారులు మహిళా సంఘంలో సభ్యత్వం ఉన్న వారికే ప్రాధాన్యం ఇస్తుండటం, రేషన్ కార్డు ఉన్నప్పటికీ సంఘంలో లేని అర్హులైన మహిళలకు చీరల అందకపోవడంతో వారు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఈ పరిస్థితిలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటనతో ఊరట వచ్చింది.

