Bangladesh

Bangladesh: షేక్ హసీనాను అప్పగించండి.. భారత్‌కు బంగ్లాదేశ్ లేఖ!

Bangladesh: మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనాను తమ దేశానికి అప్పగించాల్సిందిగా కోరుతూ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం భారత్‌కు మరోసారి అధికారికంగా లేఖ పంపింది. ఇటీవల బంగ్లాదేశ్‌లోని ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడిన కేసులో హసీనాకు మరణశిక్ష విధించిన నేపథ్యంలో ఈ అభ్యర్థన ప్రాధాన్యత సంతరించుకుంది. గత సంవత్సరం జరిగిన విద్యార్థి నిరసనకారులపై అణచివేతకు సంబంధించి మాజీ హోం మంత్రి అసదుజ్జమాన్ ఖాన్ కమల్‌తో సహా షేక్ హసీనాకు నవంబర్ 17, 2025న కోర్టు మరణశిక్ష విధించింది.2024 ఆగస్టులో విద్యార్థి ఉద్యమం తీవ్రరూపం దాల్చిన సమయంలో హసీనా దేశం విడిచి వెళ్లి, అప్పటి నుంచి ఆమె భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు.

2024 ఆగస్టులో విద్యార్థి ఉద్యమం తీవ్రరూపం దాల్చిన సమయంలో హసీనా దేశం విడిచి వెళ్లి, అప్పటి నుంచి ఆమె భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు. దోషిగా తేలిన వ్యక్తులను అప్పగించడం భారత్-బంగ్లాదేశ్ మధ్య 2013లో కుదిరిన ప్రత్యర్పణ ఒప్పందం ప్రకారం తప్పనిసరి బాధ్యత అని బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.ఈ అభ్యర్థనపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ఇంకా స్పందించాల్సి ఉంది. అయితే, అంతకుముందు వచ్చిన తీర్పుపై భారత్ స్పందిస్తూ, “తీర్పును గమనించామని, బంగ్లాదేశ్‌లో శాంతి, ప్రజాస్వామ్యం, స్థిరత్వం ఉండేలా అన్ని వర్గాలతో నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తామని” మాత్రమే పేర్కొంది. భారత్-బంగ్లాదేశ్ ప్రత్యర్పణ ఒప్పందంలోని నిబంధనల ప్రకారం, ఆరోపణలు ‘రాజకీయ స్వభావం’ కలిగి ఉన్నాయని భావిస్తే అప్పగింతను తిరస్కరించే వెసులుబాటు భారత్‌కు ఉంది. హసీనాపై వచ్చిన అభియోగాలు రాజకీయ ప్రేరేపితమైనవిగా పరిగణించి, భారత్ అప్పగింత అభ్యర్థనను తిరస్కరించే అవకాశం ఉందని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు అంచనా వేస్తున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *