Spirit: ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా భారీ చిత్రం ‘స్పిరిట్’ రెగ్యులర్ షూటింగ్ ఎట్టకేలకు అధికారికంగా ప్రారంభమైంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా, ఆదివారం భారీ ముహూర్త పూజా కార్యక్రమాలతో ఘనంగా లాంచ్ అయింది.
ప్రత్యేక అతిథిగా చిరంజీవి
ఈ ప్రారంభ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక అతిథిగా హాజరు కావడం హైలైట్‌గా నిలిచింది. చిరంజీవి చేతుల మీదుగా తొలి సన్నివేశానికి క్లాప్ కొట్టడంతో సినిమా నిర్మాణం అధికారికంగా మొదలైంది. పూజా కార్యక్రమాల్లో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, హీరోయిన్ త్రిప్తి దిమ్రితో పాటు నిర్మాతలు భూషణ్ కుమార్, వంగా ప్రణయ్, శివ్ చానానా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తీసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే, ఈ ముహూర్త పూజలో హీరో ప్రభాస్ కనిపించకపోవడం గమనార్హం.

Also Read: iBomma Ravi: ఐ బొమ్మ రవి(iBomma Ravi)కి క్రేజీ చూస్తే.. మైండ్ బ్లోయింగ్ బ్రో!
ఈ భారీ చిత్రంలో ప్రభాస్ సరసన బాలీవుడ్ నటి త్రిప్తి దిమ్రి హీరోయిన్‌గా నటిస్తోంది. అంతేకాకుండా, ముఖ్య పాత్రల్లో వివేక్ ఒబెరాయ్, ప్రకాష్ రాజ్ నటిస్తున్నట్లు ఈ సందర్భంగా చిత్ర బృందం అధికారికంగా ధృవీకరించింది. ‘స్పిరిట్’ సినిమాను టీ-సిరీస్, వంగా పిక్చర్స్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్స్‌పై అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
సందీప్ రెడ్డి వంగా శైలిలో రా, ఇంటెన్స్, పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం రూపొందనుంది. టీమ్ వెల్లడించిన సమాచారం ప్రకారం, ఈ సినిమా ప్రభాస్ కెరీర్‌లోనే కాకుండా ఇండియన్ సినిమాకే “One Bad Habit” లాంటి పెద్ద సినిమా అవుతుందని నిర్మాతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Beta feature
Beta feature

