Shashi Tharoor: ప్రజాస్వామ్యం అంటే ఇలాగే ఉండాలి

Shashi Tharoor: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో న్యూయార్క్ మేయర్ జొహ్రాన్ మమ్దానీ ఇటీవల స్నేహపూర్వకంగా భేటీ కావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపింది. ఎన్నికల సమయంలో ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్న ఈ ఇద్దరు నేతలు ఇప్పుడు కలిసి మాట్లాడుకోవడం విశేషంగా మారింది.

ఈ సమావేశంపై కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ స్పందించారు. “ప్రజాస్వామ్యం అంటే ఇలాగే ఉండాలి. ఎన్నికల సమయంలో సిద్ధాంతాల కోసం ఎంత పెద్ద పోరాటం జరిగినా, ఫలితాలు వెలువడిన తరువాత దేశ ప్రయోజనాల కోసం అధికార–ప్రతిపక్షాలు కలిసి పనిచేయాలి” అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ అంశంపై తనవంతు కృషి కొనసాగిస్తానని కూడా ‘ఎక్స్’ వేదికగా తెలిపారు.

ఇటీవలి కాలంలో శశిథరూర్ కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా ప్రధాని మోదీపై ప్రశంసతో కూడిన వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఈ వ్యాఖ్యల వల్ల కాంగ్రెస్ పార్టీలో కొంత అసంతృప్తి నెలకొంది. ఆయనకు బీజేపీ భావజాలం నచ్చితే ఇంకా కాంగ్రెస్‌లో ఎందుకు ఉన్నారని కొన్ని వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే ట్రంప్–మమ్దానీ సమావేశాన్ని శశిథరూర్ ప్రజాస్వామ్యానికి ఆదర్శంగా అభివర్ణించడం రాజకీయ చర్చలకు కారణమైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *