Hyderabad: మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ డీజీపీ సమక్షంలో మొత్తం 37 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఈ భారీ లొంగుబాటు భద్రతా విభాగాలకు పెద్ద విజయంగా నిలిచింది.
లొంగిపోయిన వారిలో తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు సాంబయ్య అలియాస్ ఆజాద్ కూడా ఉన్నాడు. ఏవోబీ ప్రాంతంలో పార్టీ నిర్మాణానికి కీలకంగా పనిచేసిన నేతగా ఆజాద్‌కు మావోయిస్టు వ్యవస్థలో కీలక స్థానం ఉంది.
ఈ లొంగుబాటులో భాగంగా పోలీసులు 303 రైఫిల్, G3 రైఫిల్, SLR, AK-47 రైఫిల్‌తో పాటు బుల్లెట్లు, క్యాట్రిజ్లను స్వాధీనం చేసుకున్నారు. భారీ ఆయుధాలు లొంగుబాటుతో బయటపడటం మావోయిస్టు దళాలకు తీవ్ర దెబ్బగా పోలీసులు పేర్కొన్నారు.
