National High Way:

National High Way: వ‌రంగ‌ల్‌-ఖ‌మ్మం హైవే విస్త‌ర‌ణ‌కు గ్రీన్‌సిగ్న‌ల్‌

National High Way: వ‌రంగ‌ల్-ఖ‌మ్మం 563 జాతీయ ర‌హ‌దారి విస్త‌ర‌ణ ప‌నుల‌కు కేంద్ర ప్ర‌భుత్వం గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చింది. ఈ మేర‌కు నిధుల‌ను కూడా విడుద‌ల చేసింది. భార‌త్‌మాల ప్రాజెక్టులో భాగంగా ర‌హ‌దారిని నాలుగు లేన్లుగా మార్చేందుకు ఈ ప‌నుల‌ను చేప‌డుతున్న‌ట్టు కేంద్ర మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. దీంతో ప్ర‌యాణ స‌మ‌యం గ‌ణ‌నీయంగా తగ్గుతుంది.

National High Way: వ‌రంగ‌ల్‌-ఖ‌మ్మం జాతీయ ర‌హ‌దారి విస్త‌ర‌ణ కోసం కేంద్ర ప్ర‌భుత్వం రూ.2,484 కోట్ల‌ను కేటాయించారు. త్వ‌ర‌లో ప‌నులు ప్రారంభం కానున్న‌ట్టు కేంద్రం వెల్ల‌డించింది. దీంతోపాటు జగిత్యాల‌-క‌రీంన‌గ‌ర్‌-వ‌రంగ‌ల్ సెక్ష‌న్‌లో ట్రాఫిక్ భారాన్ని త‌గ్గించేందుకు జంక్ష‌న్ల విస్త‌ర‌ణ‌, సెంట్ర‌ల్ లైటింగ్ సిస్టం ఏర్పాటు ప‌నులు కూడా చేప‌డుతున్నారు. ఖ‌మ్మం రోడ్డు విస్త‌ర‌ణ‌తోపాటు ఆయా ప‌నులు పూర్తయితో ట్రాఫిక్ ఇబ్బందులు తొలిగిపోనున్నాయి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *