RGV

RGV: పైరసీ ఎప్పటికీ ఆగదు.. వర్మ సంచలన ట్వీ్ట్

RGV: ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) ఐబొమ్మ రవి అరెస్ట్ నేపథ్యంలో పైరసీ, దానికి మద్దతు ఇచ్చే వారిపై తనదైన శైలిలో సంచలన ట్వీట్ చేశారు. పైరసీని పూర్తిగా ఆపడానికి ఏకైక పరిష్కారాన్ని సూచించారు. పైరసీ ఎప్పటికీ ఆగదు. సాంకేతికత ఎంత అభివృద్ధి చెందినా, పోలీసు నిఘా ఎంత పెరిగినా, దొంగిలించిన సినిమాను ఉచితంగా చూడాలనుకునే ప్రేక్షకులు ఉన్నంత కాలం, వారికి లింకులు అందించడానికి రవి లాంటి వారు పుడుతూనే ఉంటారు. రవిని కొంతమంది రాబిన్ హుడ్తో పోల్చడంపై ఆర్జీవీ మండిపడ్డారు. రాబిన్ హుడ్ హీరో కాదు. నేటి నిర్వచనాల ప్రకారం, అతడు ప్రపంచంలోనే మొట్టమొదటి ఉగ్రవాది. ధనవంతులను దోచుకుని పేదలకు పంచుతాడు. ధనవంతులుగా ఉండటమే వారి ఏకైక నేరం. ఆర్థికంగా విజయం సాధించడం దొంగతనం, హత్యతో శిక్షించదగిన నేరం అనుకోవడం ఎంతటి పతనం?” అని ప్రశ్నించారు. దొంగిలించబడిన వస్తువులను ఉచితంగా పొందుతున్నారనే కారణంతో నేరస్తుడిని సాధువుగా కీర్తించడం అజ్ఞానం అన్నారు.

సినిమా ఖరీదా? అప్పుడు పైరసీ సరైనదే. పాప్‌కార్న్ ధర ఎక్కువైందా? అప్పుడు సినిమా లీక్ చేయాలి. టికెట్ ధరలు ఎక్కువైతే కంటెంట్‌ను దొంగిలించాలి అనే ఈ తర్కం అత్యంత ప్రమాదకరమని ఆర్జీవీ హెచ్చరించారు. ఈ లాజిక్ ప్రకారం.. బీఎండబ్ల్యూ కారు ఖరీదైతే షోరూం దోచుకుని అందరికీ పంచాలా? బంగారం ఖరీదైతే నగల షాపు దోచుకుని ఉచితంగా ఇవ్వాలా?” అని ప్రశ్నించారు. ఈ రకమైన ఆలోచన సామాజిక విచ్ఛిన్నతకు, అరాచకానికి దారితీస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.పైరసీని పూర్తిగా ఆపాలనుకుంటే సరఫరా చేసేవారినితో పాటు చూసేవారిని కూడా నేరస్తులుగా పరిగణించాలి. దొంగను పట్టుకోవడం కష్టం, కానీ చూసేవాడిని పట్టుకోవడం సులభం అని ఆర్జీవి తెలిపారు. యాదృచ్ఛికంగా 100 మంది పైరసీ చూసేవారిని అరెస్ట్ చేసి, వారి పేర్లను బహిరంగంగా ప్రకటిస్తే, సినిమా లింక్ చూడటం లేదా ఫార్వార్డ్ చేయడం అంటే దొంగిలించబడిన వస్తువులను అందుకోవడమేనని అందరూ గ్రహిస్తారు. భయం పనిచేస్తుంది, నీతి పనిచేయదు అని ఆర్జీవీ తన ట్వీట్‌లో తేల్చి చెప్పారు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *