Harish Rao

Srivari Brahmotsavam: హరీష్ రావుకు ప్రత్యేక ఆహ్వానం..

Srivari Brahmotsavam: మహా గ్రూప్ ఆధ్వర్యంలో, మహా భక్తి ఛానల్ సారథ్యంలో “తిరుమల తిరుపతి దేవస్థానం” (TTD) వారిచే నిర్వహించబడుతున్న శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవం నవంబర్ 26న గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా జరగనుంది. ఈ సందర్భంగా కార్యక్రమానికి హరీష్ రావు గారిని మహా న్యూస్ డెస్క్ ఇంచార్జ్ ఇంకా సోషల్ మీడియా ఇంచార్జ్ ప్రత్యక్షంగా కలిసి ఆహ్వానించారు.

ఈ కార్యక్రమం గురించి హరీష్ రావు మాట్లాడుతూ.. భక్తులందరినీ ఈ వేడుకలో పాల్గొని శ్రీ వేంకటేశ్వర స్వామివారి అనుగ్రహం పొందాలని నిర్వాహకులు కోరుతున్నారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో శ్రీ శ్రీనివాస కల్యాణ మహోత్సవంను మహా టీవీ ఆధ్వర్యంలో నిర్వహించడం చాలా సంతోషకరమని హరీష్ రావు గారు తెలిపారు.

ఈ కల్యాణాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారని, ఉత్సవ మూర్తులు, వేద పండితులు అందరూ కూడా తిరుమల నుంచే వస్తున్నారని పేర్కొన్నారు.

తిరుమలకు వెళ్లలేని భక్తులు, బ్రేక్ దర్శనం దొరకని వారు, వ్యయప్రయాసలకు లోనయ్యే వారు ఎంతో మంది ఉన్నారని, వారి కోసం హైదరాబాద్ ప్రజలందరి సమక్షంలో, లోక కల్యాణం కోసం ఈ కల్యాణం జరుగుతుందని తెలిపారు.

ఇలాంటి మంచి కార్యక్రమాన్ని చేపట్టినందుకు మహా టీవీ యాజమాన్యాన్ని మరియు సిబ్బందిని హృదయపూర్వకంగా అభినందించారు.

ప్రతి ఏడాది భక్తి, సంప్రదాయాలతో నిర్వహించే ఈ మహోత్సవం ఈసారి హైదరాబాదులో విశేషమైన ఆకర్షణగా నిలవనుంది. ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొననున్నారని నిర్వాహకులు తెలుపుతున్నారు. నంబర్ 26వ తేదీన సాయంత్రం 5.00 గంటలకు ప్రారంభమయ్యే ఈ వేడుకలో ప్రత్యేక పూజలు, శ్రీవారి సేవలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడనున్నాయి.

ముఖ్య వివరాలు:

  • కార్యక్రమం: శ్రీ వెంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవం (శ్రీవారి దివ్య కళ్యాణం)
  • తేదీ: నవంబర్ 26, 2025
  • వేదిక: గచ్చిబౌలి స్టేడియం, హైదరాబాద్.
  • నిర్వహణ: తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఆధ్వర్యంలో మహా గ్రూప్ (Mahaa TV) ద్వారా జరిగింది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *