Anupama: మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ 2025లో అరుదైన రికార్డు సృష్టించింది. ఒకే ఏడాది ఏడు చిత్రాలు రిలీజ్ చేసి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. మరో చిత్రం డిసెంబర్ 5న రిలీజ్ కానుంది. సౌత్ ఇండియా అందాల భామల్లో ముందు వరుసలో నిలిచిన అనుపమ పరమేశ్వరన్ 2025లో ఒక్కసారిగా ఏడు సినిమాలు రిలీజ్ చేసి అరుదైన రికార్డు సృష్టించింది. డ్రాగన్, పరదా, కిష్కింధపురి, జానకి వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ, ది పెట్ డిటెక్టివ్, బైసన్ వంటి విభిన్న భాషల చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది. మలయాళం, తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో ఆమెకు బలమైన ఫాలోయింగ్ ఉంది. ఈ ఏడాది ఆమె నటించిన మరో చిత్రం ‘లాక్‌డౌన్’ డిసెంబర్ 5న రిలీజ్ కానుండడంతో మొత్తం ఎనిమిది చిత్రాలు అవుతున్నాయి. ఒకే ఏడాది ఇంతమంది హీరోయిన్‌లు రాణించడం చాలా అరుదు. మరి అనుపమ సృష్టించిన ఈ రికార్డును ఎవరు బద్దలు కొడతారో చూడాలి.

