Delhi Bomb Blast: దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో జరిగిన హై-ఇంటెన్సిటీ కారు పేలుడు కేసు దర్యాప్తులో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)కి దిగ్భ్రాంతికరమైన విషయాలు వెల్లడవుతున్నాయి. ఈ దాడి వెనుక వైట్-కాలర్ టెర్రర్ నెట్‌వర్క్ (White-Collar Terror Network) ఉన్నట్లు తేలగా, తాజాగా ఈ వైద్య నిపుణులతో కూడిన మాడ్యూల్‌ను పాకిస్తాన్ మద్దతు ఉన్న ఉగ్రవాద సంస్థలు జైష్-ఎ-మొహమ్మద్ (JeM) మరియు అన్సార్ ఘజ్వత్-ఉల్-హింద్ (AGuH) సంస్థలు నడిపిస్తున్నట్లు దర్యాప్తు వర్గాలు ధృవీకరించాయి.
ఎర్రకోట పేలుడును ఆత్మాహుతి దాడిగా NIA నిర్ధారించింది. ఈ దాడిని ఫరీదాబాద్‌లోని అల్ ఫలాహ్ యూనివర్సిటీలో పనిచేసే కాశ్మీరీ వైద్యుడు డాక్టర్ ఉమర్ నిర్వహించినట్లు గుర్తించారు.
ఆత్మాహుతి వీడియోలతో బ్రెయిన్‌వాష్
దర్యాప్తులో అరెస్టయిన వైద్య నిపుణులలో చాలామందిని ఉగ్రవాద కార్యకలాపాల కోసం మానసికంగా సిద్ధం (Psychological Priming) చేయడానికి JeM హ్యాండ్లర్లు అధునాతన వ్యూహాన్ని ఉపయోగించినట్లు తెలిసింది.
జైష్-ఎ-మహ్మద్ నిర్వాహకులు ఎన్‌క్రిప్టెడ్ మొబైల్ అప్లికేషన్‌ల ద్వారా ఈ ‘డాక్టర్ మాడ్యూల్’ సభ్యులతో సన్నిహితంగా ఉన్నారు. దాదాపు 30కి పైగా ఆత్మాహుతి బాంబు దాడులకు సంబంధించిన వీడియోలను నిందితులకు పంపించారు. ఈ వీడియోలు ఆత్మాహుతి కార్యకలాపాలను కీర్తించడంతో పాటు, బాంబర్ల మనస్తత్వాన్ని, కొత్త నియామకాలు ఎలా ప్రేరేపించబడతాయో వివరించాయి
ఇది కూడా చదవండి: Miss Universe 2025: మిస్ యూనివర్స్ 2025: మెక్సికో భామ ఫాతిమా బాష్
వైద్య నిపుణులను లక్ష్యంగా చేసుకుని చేపట్టిన ఒక నిర్మాణాత్మక బోధనా ప్రక్రియ (Structured Indoctrination Process)లో భాగంగా ఈ వీడియోలను షేర్ చేసినట్లు దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. ఫరీదాబాద్‌లోని అల్ ఫలాహ్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ ముజమ్మిల్ షకీల్ గనాయ్ ఈ వీడియోలు ప్రచారం చేసిన విధానం, గుర్తించకుండా ఉండేందుకు హ్యాండ్లర్లు వాడిన ఎన్‌క్రిప్టెడ్ ఛానెల్‌ల వివరాలు వెల్లడించినట్లు సమాచారం.
ఇర్ఫాన్ పాత్ర కీలకం: కాశ్మీర్ నుంచి నెట్‌వర్క్
ఈ కుట్రలో కీలకంగా వ్యవహరించిన వ్యక్తిగా మౌల్వి ఇర్ఫాన్ను దర్యాప్తు వర్గాలు గుర్తించాయి. ఇతడు AGuH మరియు JeM ఉగ్రవాద సంస్థల మధ్య వారధిగా, ఈ మాడ్యూల్‌కు కేంద్ర నిర్వాహకుడిగా పనిచేసినట్లు తేలింది.కాశ్మీర్‌లో జైషేకు స్లీపర్ సెల్‌గా పనిచేస్తున్న ఇర్ఫాన్, హతమైన ఉగ్రవాది ముజమ్మిల్ తంత్రే ద్వారా అనేక మంది AGuH మరియు JeM కమాండర్లతో పరిచయం పెంచుకున్నాడు.
ఇది కూడా చదవండి: PM Modi G20 summit: జీ20 సదస్సుకు మోదీ.. ఆ కీలక దేశాధ్యక్షుడు గైర్హాజరు
నిందితులైన వైద్యులను ఉగ్రవాద కమాండర్లతో అనుసంధానించడంలో, కుట్రను రూపొందించడంలో ఇర్ఫాన్ కీలక పాత్ర పోషించాడు. డాక్టర్ ఉమర్ ఉన్ నబీతో సహా పలువురు వైద్య నిపుణులను తన సైద్ధాంతిక ప్రభావంతో కుట్రకు సిద్ధం చేశాడు. డాక్టర్ ముజమ్మిల్ షకీల్… ఇర్ఫాన్‌ను డాక్టర్ అదీల్ అహ్మద్ రాథర్ మరియు డాక్టర్ ఉమర్ మొహమ్మద్ నబీకి పరిచయం చేశాడు. వీరంతా AGuH కి గట్టి మద్దతుదారులుగా మారి, ‘స్థానిక కాశ్మీరీ ఉగ్రవాద సంస్థ’ను స్థాపించాలనే ఆశయాన్ని పంచుకున్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు.
విస్తృత కుట్ర ఛేదన
ఈ దర్యాప్తు కేవలం ఎర్రకోట పేలుడుకు మాత్రమే పరిమితం కాలేదు. జాతీయ రాజధాని ప్రాంతంలోని హై-సెక్యూరిటీ జోన్లలో హమాస్ తరహా డ్రోన్ మరియు రాకెట్ దాడులకు ప్రణాళికలు వేసిన విస్తృత కుట్రను కూడా NIA ఛేదించింది. ఈ డాక్టర్ మాడ్యూల్ అరెస్టులతో దేశంలో అత్యున్నత భద్రతా మండలాలు లక్ష్యంగా సాగిన ఒక పెద్ద కుట్ర పటాన్ని భగ్నం చేసినట్లయింది.

