Ibomma

Ibomma: మీ దేశంలో పర్మనెంట్ గా మూసేస్తున్నాం.. ఐబొమ్మ మెసేజ్!

Ibomma: తెలుగు సినీ పరిశ్రమను పట్టిపీడిస్తున్న పైరసీ భూతానికి కొంతవరకు ఊరట లభించింది. ప్రముఖ పైరసీ వెబ్‌సైట్లు ‘ఐబొమ్మ’ (iBOMMA) మరియు ‘బప్పం టీవీ’ (Bappam TV) ల నిర్వాహకుడు, విశాఖపట్నం వాసి అయిన ఇమ్మడి రవిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్‌తో పాటు, ఆ వెబ్‌సైట్లను శాశ్వతంగా మూసివేయడంలో పోలీసులు విజయం సాధించారు.

పోలీసులు ఒక అడుగు ముందుకేసి, నిన్న స్వయంగా నిందితుడు ఇమ్మడి రవి చేతనే ఆ వెబ్‌సైట్లను మూయించేశారు. ఈ నేపథ్యంలో, తాజాగా ఆ వెబ్‌సైట్లను తెరిచేందుకు ప్రయత్నించిన వారికి ఊహించని పరిణామం ఎదురైంది. ‘ఐబొమ్మ’ వెబ్‌సైట్ ఓపెన్ కాకపోగా, ఒక ముఖ్యమైన సందేశం దర్శనమిచ్చింది.

యూజర్లకు ‘ఐబొమ్మ’ గుడ్‌బై.. ఏముందంటే?

ఆ వెబ్‌సైట్‌లో కనిపించిన సందేశం వివరాలు ఇలా ఉన్నాయి: మీరు ఇటీవల మా గురించి విన్న ఉండవచ్చు లేదా ఎప్పటినుంచో మా సేవలను వినియోగిస్తున్న వారై ఉండవచ్చు. కానీ మీకు ఒక దుర్వార్త చెప్పాల్సి వస్తోంది. మీ దేశంలో మేము పర్మనెంట్‌గా ఈ సేవలను నిలిపివేస్తున్నాం. దయచేసి మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం వ్రాసి ఉంది.

ఇది కూడా చదవండి: Sai Durga Tej: తిరుమల సాక్షిగా పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన సాయి ధరమ్ తేజ్

ఈ సందేశంతో ‘ఐబొమ్మ’ భారతదేశంలో తమ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు స్పష్టమైంది. అంతేకాకుండా, ‘బప్పం టీవీ’ వెబ్‌సైట్ కూడా ఓపెన్ కాకపోవడం గమనార్హం.

విదేశాల నుంచి ‘దోపిడీ’ దందా!

ఇమ్మడి రవి దేశంలో ఉంటూ ఈ పైరసీ కార్యకలాపాలు నడపడం లేదు. అతను కరీబియన్ దీవుల్లో నివాసం ఉంటున్నట్లు తెలుస్తోంది. అక్కడి నుంచే తెలుగు సినిమాల మాస్టర్ ప్రింట్లను దొంగతనం చేసి, వాటిని తన పైరసీ వెబ్‌సైట్లలో అప్‌లోడ్ చేసి భారీగా డబ్బులు సంపాదిస్తున్నాడు. హైదరాబాద్‌లో సుమారు మూడు కోట్ల విలువ చేసే నివాసాన్ని కూడా అతను ఏర్పరచుకున్నాడు.

ఈ అరెస్ట్ మరియు వెబ్‌సైట్ల మూసివేత టాలీవుడ్‌కు ఒక పెద్ద విజయాన్ని అందించింది. అయినప్పటికీ, ఇతర పైరసీ వెబ్‌సైట్లపై కూడా నిఘా పెంచాల్సిన అవసరం ఉందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *