Viral News: తెలుగు సినిమా పరిశ్రమతో పాటు ప్రపంచ సినీ ప్రేమికులందరూ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం. సూపర్‌స్టార్ మహేష్ బాబు హీరోగా, దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న ‘వారణాసి’. భారీ అంచనాల మధ్య రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వహించిన ఈ చిత్రం తొలి ఈవెంట్, అభిమానులకు పండుగ వాతావరణాన్ని సృష్టించింది. ఈ వేడుకలో టైటిల్‌తో పాటు, మహేష్ ఫస్ట్ లుక్ గ్లింప్స్‌ను విడుదల చేశారు.
విడుదల తేదీ ఖరారు
ఈ భారీ ఈవెంట్‌కు మహేష్ అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. వారి సమక్షంలోనే సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి సినిమా విడుదల తేదీని ప్రకటించారు. ‘వారణాసి’ సినిమా 2027 మార్చ్‌లో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మేరకు చిత్ర బృందం అఫిషియల్‌గా ప్రకటన చేయడంతో, అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి.
‘వారణాసి’ అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ విడుదల చేసిన ఫస్ట్ లుక్ గ్లింప్స్‌తో అభిమానులు పూనకాలతో ఊగిపోయారు. “ఇది కదా మాకు కావాల్సింది… ఇక బాక్సాఫీస్ బద్దలవ్వడమే లేటు” అంటూ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: Saudi Arabia Bus Accident: సౌదీ బస్సు ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి.
టైలర్/గ్లింప్స్‌లో మహేష్ బాబు లుక్, అద్భుతమైన విజువల్స్ చూస్తుంటే మైండ్ బ్లాక్ అవుతోందని ప్రేక్షకులు అంటున్నారు. ఈ చిత్రం ప్రేక్షకులను మరో కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లే విధంగా రాజమౌళి అత్యంత భారీ స్థాయిలో రూపొందిస్తున్నట్లు గ్లింప్స్ నిరూపించింది.
ఈ సినిమాలో ఇప్పటికే బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ రివీల్ చేయగా, వారు ఈ ప్రాజెక్ట్‌కు గ్లోబల్ లుక్ తీసుకురావడం ఖాయమని తెలుస్తోంది. నిన్నటి ఈవెంట్లో మహేష్ బాబు ఎంట్రీ కూడా ప్రత్యేకంగా హైలైట్ అయింది.
పెళ్లి వదిలేసి.. టీజర్ చూసిన అభిమాని
‘వారణాసి’ ఈవెంట్ రోజునే ఒక వీరాభిమాని చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సరిగ్గా మహేష్ బాబు గ్లింప్స్ విడుదలయ్యే సమయానికి ఆ అభిమానికి పెళ్లి వేడుక జరుగుతోంది.
అయినా కూడా, తన అభిమానాన్ని చాటుకుంటూ ఆ అభిమాని.. పెళ్లి వేడుకలో ఏకంగా ఓ పెద్ద స్క్రీన్ ఏర్పాటు చేశాడు. కరెక్ట్‌గా టీజర్ వచ్చే సమయానికి స్టేజ్ పైన పెళ్లి కూతురుని ఒక్కదాన్నే వదిలేసి, తన స్నేహితులతో కలిసి స్క్రీన్ ముందు కూర్చున్నాడు. మహేష్ ఎంట్రీ సీన్లో విజిల్స్ వేస్తూ, సందడి చేస్తూ టీజర్‌ను ఎంజాయ్ చేశాడు.
మహేష్ బాబుపై ఉన్న ఈ అభిమానాన్ని చాటే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై మహేష్ అభిమానులు రకరకాల కామెంట్లు చేస్తూ, తమ హీరోపై ఉన్న అభిమానాన్ని చాటుకుంటున్నారు.

