Rithu Chowdary: అతని కోసం ఇంట్లో నుండైనా వెళ్ళిపోతా..

Rithu Chowdary: బిగ్‌బాస్ సీజన్ 9 ఇప్పుడే 11వ వారంలోకి అడుగుపెట్టింది. ఇంకా నాలుగు వారాల్లో గ్రాండ్ ఫినాలే జరగనుంది. ఈ వారం డబుల్ ఎలిమినేషన్‌లో భాగంగా నిఖిల్ ఇప్పటికే బయటకు వెళ్లగా, మరికొద్ది గంటల్లో గౌరవ్ కూడా ఎలిమినేట్ అవ్వనున్నట్లు సమాచారం.

ఇదిలా ఉంటే, తాజాగా విడుదలైన ప్రోమోలో నాగచైతన్య గెస్ట్‌గా హౌస్‌కు వచ్చారు. ‘‘నాకు యాక్టింగ్‌తో పాటు రేసింగ్ అంటే చాలా ఇష్టం. నాలుగేళ్ల క్రితం ఇండియన్ రేసింగ్ లీగ్ ప్రారంభమైంది. అందులో హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్ టీమ్‌కు నేను ఓనర్’’ అని చైతూ చెప్పగా, ‘‘నాకు తెలియకుండా ఎప్పుడు చేశావు?’’ అంటూ నాగార్జున నవ్వుతూ ప్రశ్నించగా, ‘‘చేశానులే సార్’’ అని చైతూ సమాధానమిచ్చాడు.

తర్వాత హౌస్‌మేట్స్‌కి చైతన్యను పరిచయం చేశారు. ఆయనను చూసిన రీతూ ‘‘మీరంటే పిచ్చి’’ అని చెప్పగా, నాగార్జున ‘‘నన్నంటే ఇష్టం అన్నావుగా?’’ అని అటెన్షన్ తీసుకొచ్చాడు. దీనిపై రీతూ ‘‘ఎప్పటికీ మీరు మీరే సార్’’ అని చెప్పి నవ్వులు పూయించింది.

చైతూ రీతూకి సరదాగా ‘‘అయితే నీ పేరు జెస్సీ కాదు కదా?’’ అని సెటైర్ వేయడంతో హౌస్‌లో అందరూ నవ్వుకున్నారు.

అటు తరువాత నాగార్జున, ‘‘చైతూ నిన్ను బైక్‌పై తీసుకెళ్తాడు’’ అని రీతూకి బంపర్ ఆఫర్ ఇస్తాడు. వెంటనే ఆమె ‘‘ఐయామ్ కమింగ్… ఆయన కోసం ఎలిమినేట్ అయి ఇప్పుడే బయటకు వస్తా’’ అని సరదాగా చెప్పేసింది. దీంతో చైతూ షాక్ అవుతూ, ‘‘నువ్వు గెలిచినా కూడా తర్వాత నిన్ను బైక్‌పై తీసుకెళ్తా’’ అని చెప్పాడు.

చైతూ–రీతూ మధ్య జరిగిన ఈ ఫన్నీ సంభాషణ ప్రేక్షకుల్లో మంచి నవ్వులు పూయిస్తోంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *