Tejashwi Yadav: మహాగఠ్ బంధన్ సీఎం అభ్యర్థి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ కి మరోసారి భంగపాటు తప్పలేదు. ఎన్డీయేకు గట్టి పోటీ ఇస్తారని భావించగా ఘోర పరాభవాన్ని ముటగట్టుకున్నారు. సీట్ల పంపకాల్లో అత్యధిక స్థానాలు తీసుకున్నా తన పార్టీని గెలుపు తీరానికి చేర్చలేకపోయారు. ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చినా లాలూ కుమారుడిని బిహార్ ఓటర్లు ఖాతరు చేయలేదు. లాలూ హయాం నాటి జంగిల్ రాజ్ పాలన, యాదవ-ముస్లిం వర్గంపైనే ఆధారపడటం వంటి అంశాలు మహాగఠ్ బంధన్ ఓటమికి కారణాలుగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Also Read: Terror Conspiracy: ప్రాక్టీస్ చేయడానికి వీల్లేదు.. ఉగ్రవాద నిందితులకు బిగ్ షాక్!
ఇక బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార NDA కూటమి అఖండ విజయం సాధించింది. మెుత్తం 243 స్థానాలకు 203 చోట్ల జయభేరి మోగించింది. జంగల్ రాజ్ నాటి చీకటి రోజులను గుర్తుచేసుకున్న బిహారీలు RJD నేతృత్వంలోని మహాగఠ్ బంధన్ కూటమిని నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. ఫలితంగా విపక్ష కూటమి 34 స్థానాలకే పరిమితమైంది. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ నెలకొల్పిన జనసూరజ్ పార్టీ ఖాతా తెరవలేదు సరి కదా ఒక్కస్థానంలో కనీసం చెప్పుకోదగిన ఓట్లు కూడా సాధించలేకపోయింది.

