Adah Sharma: బాలీవుడ్ నటి అదా శర్మ తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన జర్నీ, పాత్రల ఎంపికపై క్లారిటీ ఇచ్చారు. 2008లో విక్రమ్ భాట్ దర్శకత్వంలో వచ్చిన హారర్ చిత్రం ‘1920’తో తెరపైకి వచ్చిన అదా, అప్పటి నుంచి సాహసోపేతమైన పాత్రలకే ప్రాధాన్యత ఇచ్చిందనీ, అదే ఎంపికలు ఆమెకు ప్రత్యేక గుర్తింపునిచ్చాయని పేర్కొన్నారు.
రిస్క్ ఉన్న పాత్రలు మాత్రమే నాకు ఆకర్షణీయమని నేను నమ్ముతాను. పాత్రలో భావోద్వేగం కూడా ఉండాలి, యాక్షన్ సన్నివేశాలు కూడా ఉండాలి — అలా ఉన్నప్పుడే పాత్రలో నా ఆసక్తి ఉంటుంది. నా కుటుంబం కూడా ఆ పాత్రలు చూస్తే కొంత ఆందోళన చెందాలి లేకపోతే నేను వాటిని ఎందుకు చేయాలి అని భావిస్తాను అని ఆమె చెప్పారు.
Also Read: SSMB29: Globetrotter ఈవెంట్ కు పోలీసుల కండిషన్స్.. స్పెషల్ వీడియోతో రాజమౌళి క్లారిటీ..!
ఆమె కెరీర్‌లో టర్నింగ్ పాయింట్‌గా మారిన చిత్రం 2023లో విడుదలైన ‘ది కేరళ స్టోరీ’. లేడీ-ఓరియెంటెడ్ కావడం, తీవ్ర రాజకీయ చర్చలకు దారితీయడంతో ఈ సినిమా దేశవ్యాప్తంగా పెద్ద స్థాయిలో చర్చింపబడింది. ఈ చిత్రం ఆదాయంగా ఊహించని రీతిలో విజయాన్ని సాధిస్తూ, 400 కోట్లకు పైగా వసూళ్లను సంపాదించినట్లు వార్తలు వచ్చాయి. ఈ విజయంతో అదా నేషనల్ లెవెల్లో ఫేమ్ వచ్చింది, వివిధ మీడియా ఇంటర్వ్యూల్లో, టాక్‌షోలలో ఆమెపై ప్రత్యేక ఫోకస్ ఏర్పడింది.
అదా చెప్పిన మరో గమనార్హ విషయం ‘ది కేరళ స్టోరీ’ విడుదల సమయంలో ఆమెపై తీవ్రమైన విమర్శలు, బెదిరింపులు వచ్చాయని ఆమె గుర్తుచేశారు. ‘‘దేశంలో సగం మందికి నన్ను చంపాలని అనిపించిందని మిగతా సగం మంది నన్ను ప్రేమించి రక్షించారు’ అని అదా స్పష్టం చేశారు. మొత్తానికి, అదా భావిస్తుందేమంటే—సాహసోపేత పాత్రలే కెరీర్‌కు చక్కటి విలువ ఇస్తాయన్నారు. మొదటి సినిమాతోనే గుర్తింపు వచ్చినప్పటికీ ఆమె ఇంకా కొత్త, సవాలు ఉన్న స్క్రిప్ట్‌ల కోసం ఎదురు చూస్తూనే ఉందని, ఆ ప్రయత్నాలే ఆమెను ముందుకు నడిపిస్తున్నాయని ఇంటర్వ్యూలో చెప్పింది.
