jubliee hills By elections 2025:జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పడిన ఓట్లు ఈవీఎం యంత్రాలలో నిక్షిప్తమై ఉన్నాయి. నవంబర్ 14న జరిగే ఓట్ల లెక్కింపుతో అభ్యర్థుల భవితవ్యం తేలనున్నది. ఈ మేరకు ఈవీఎం యంత్రాలను యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్టేడియంలో డిస్ట్రిబ్యూషన్ కమ్ రిసెప్షన్ సెంటర్ (డీఆర్సీ) ను అధికారులు ఏర్పాటు చేశారు. శుక్రవారం (నవంబర్ 14) ఉదయం 8 గంటల నుంచే ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలవుతుంది.
jubliee hills By elections 2025:జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మొత్తం 4,01,365 ఓట్లకు గాను 1,94,632 ఓట్లు పోలయ్యాయి. అంటే 48.49 శాతం ఓట్లు పోలయ్యాయన్న మాట. నిరుడు 47.49 శాతం ఓట్లు పోలవగా, ఈ సారి ఒక్కశాతం ఓటింగ్ పెరిగింది. ఓట్ల లెక్కింపు కేంద్రంలో ఏర్పాటు చేసిన 42 టేబుళ్లపై 10 రౌండ్ల వారీగా ఓట్ల లెక్కింపును చేపట్టనున్నారు. తొలుత ఇళ్ల వద్ద సేకరించిన 103 ఓట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత ఇతర ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపడుతారు.
jubliee hills By elections 2025:ఒక టేబుల్‌కు సూపర్ వైజర్, మరొకరు అసిస్టెంట్ టేబుల్ సూపర్ వైజర్, మరొకరిని సహాయకులుగా నియమించారు. పోలింగ్ స్టేషన్ నంబర్ 1 నుంచి 407 వరకు ఇప్పటికే స్ట్రాంగ్ రూంలలో భద్రపరిచారు. వాటిని ఓట్ల లెక్కింపు ఏజంట్ల సమక్షంలో సీల్ తీసి ఓపెన్ చేస్తారు. తక్కువ ఓటింగ్ నమోదు కావడంతో మధ్యాహ్నం లోపే ఫలితం వెల్లడయ్యే అవకాశం ఉన్నదని తెలుస్తున్నది.

