Pakistan News:పాకిస్థాన్ అంతర్గత కుమ్ములాటలతో అతలాకుతలం అవుతున్నది. మరోవైపు అఫ్ఘానిస్థాన్ తాలిబన్లు కొరకరాని కొయ్యగా మారారు. ఈ పరిస్థితుల్లో పాక్‌లో మరో రాజకీయ విపరీతం చోటుచేసుకున్నది. పాకిస్థాన్ రాజకీయాలనే శాసించే పరిణామం జరిగింది. దేశ సైన్యాధ్యక్షుడికి అపరిమిత అధికారాలను కట్టబెడుతూ తెచ్చిన బిల్లు ఆమోదం పొందింది. అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు అధికారాలను పరిమితం చేస్తూ తీసుకొచ్చిన ఆ రాజ్యాంగ సవరణ బిల్లుకు పాకిస్థాన్ పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం ప్రజాస్వామ్య విఘాతంగా విమర్శకులు విమర్శలు గుప్పిస్తున్నారు.
Pakistan News:ఈ కొత్త చట్టం ప్రకారం.. ప్రస్తుత ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్‌ను చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ అనే కొత్త పదవిలో నియమించనున్నారు. ఈ హోదాతో ఆయనకు సైన్యంతోపాటు నౌకాదళం, వాయుసేన దళాలపై కూడా పూర్థిస్థాయి అధికారాలు లభిస్తాయి. త్రివిధ దళాలపై సైన్యాధిపతికి అధికారికంగా బాధ్యతలు అప్పగించడం ఆ దేశంలో ఇదే తొలిసారి కావడం గమనార్హం.
Pakistan News:ఇదిలా ఉండగా మరిన్ని విశేషాధికారాలు ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్‌కు కట్టబెడుతూ చట్టంలో మార్పులను తీసుకొచ్చారు. ఆ నిబంధనలు మరింత వివాదాస్పందంగా ఉండటం విస్మయం కలిగించక మానదు. పదవీ విరమణ పొందిన తర్వాత కూడా ఆసిమ్ మునీర్ ర్యాంకు కొనసాగుతుంది. ఆయనకు జీవితకాలం చట్టపరమైన విచారణల నుంచి పూర్తిస్థాయి రక్షణ కల్పించనున్నారు.

