Raja Saab: ప్రబాస్ నటిస్తున్న రాజాసాబ్ ఫస్ట్ సింగిల్ విడుదలపై రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న ఈ హారర్ కామెడీకి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రొడ్యూసర్ ఎస్‌కేఎన్ ఆలస్యానికి కారణాలు వివరించారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే..?
Also Read: Prabhas: రెబల్ స్టార్ నుండి ‘ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్’గా ప్రభాస్ జర్నీ!
రాజాసాబ్ ఫస్ట్ సింగిల్ విడుదల ఆలస్యంపై చర్చ సాగుతోంది. ప్రొడ్యూసర్ ఎస్‌కేఎన్ స్పందించి క్లారిటీ ఇచ్చారు. ఉత్తర భారత, తెలుగు మార్కెటింగ్ టీమ్‌ల మధ్య చర్చలే ఆలస్యానికి కారణమని తెలిపారు. మొదట రెబెల్ సాబ్ సాంగ్ రిలీజ్ ప్లాన్ చేశారు. కానీ ఉత్తర భారత పంపిణీదారులు మెలోడి సాంగ్ ముందు విడుదల చేయాలని సూచించారు. దక్షిణంలో లిరికల్ వీడియోలు హుక్ స్టెప్‌తో రిలీజ్ చేస్తారు. పూర్తి వీడియో థియేటర్స్‌లోనే చూడమని వదిలేస్తారు. ఉత్తరంలో మాత్రం పూర్తి సాంగ్ వీడియోలు ముందుగా వస్తాయి. ఈ వ్యత్యాసం కూడా ఆలస్యానికి దోహదం చేసింది. సినిమాలో ఐటెం సాంగ్ లేదు. పాపులర్ హిందీ సాంగ్ రీమిక్స్ ఒకటి రెడీ అయింది. ప్రతి సాంగ్ మధ్య 10-14 రోజుల గ్యాప్ ఇస్తారు. అభిమానులు మ్యూజిక్ ఆస్వాదించేలా చూస్తారు. అయితే ఫస్ట్ సింగిల్ నవంబర్ మూడవ లేదా నాల్గవ వారంలో రానుందట. డిసెంబర్ చివరి వరకు ప్రమోషన్స్ సాగుతాయట. జనవరి 9, పొంగల్‌కు ఈ సినిమా ఘనంగా రిలీజ్ అవుతుందని క్లారిటీ ఇచ్చారు.
